
మనుషుల్లో రకరకాల మనస్తత్వం కలవారు ఉన్నట్లు జంతువుల్లో కూడా అలాంటి వేరియేషన్స్ కనపడుతుంటాయి. ముఖ్యంగా పాడి పశువుల్లో కొన్ని తన యజమాని కుటుంబం పట్ల అమితమైన ప్రేమను, విశ్వాసాన్ని కనబరుస్తుంటాయి. ఎవరైనా తన యజమానికి కొట్టడానికి ప్రయత్నించినప్పుడు పశువులు అడ్డు తగులుతుండటం చూస్తుంటాం. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం అలాంటి వీడియోనే ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. తన యజమాని ఇంటిలోని ఓ చిన్నపిల్లవాడిని కొమ్ములతో పొడవడానికి వచ్చిన మరో పశువు నుంచి ఓ ఆవు చాకచక్యంగా కాపాడుతుంది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట సంచలనంగా మారింది.
వీడియోలో ఒక చిన్న పిల్లవాడు పొలంలో మట్టితో ఆడుకుంటున్నాడు. ఒక ఎద్దు అతన్ని చూసి పరిగెత్తుకుంటూ వచ్చింది. పిల్లవాడిని కొమ్ములతో పొడవానికి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఒక ఆవు అక్కడున్న పిల్లవాడికి ‘రక్షకుడిగా’ మారింది. వేగంగా ఉరుకొచ్చిన ఎద్దు దాదాపు బాలుడిపైకి దూకింది. ఈ క్రమంలో అంతే వేగంగా పరిగెత్తుకుంటు వచ్చిన ఆవు బాలుడికి ఏమీ కాకుండా రక్షిస్తుంది. పొడవడానికి వచ్చిన ఎద్దును అడ్డుకుంటూ బాలుడిని తన కడుపు కింద దాస్తుంది. ఆ క్రమంలో ఎద్దు కూడా దాడి చేయడానికి ధైర్యం చేయలేదు. ఇంతలో ఓ వ్యక్తి వచ్చి ఆ పిల్లవాడిని పక్కకు తీసుకెళ్లడం వీడియోలో కనిపిస్తుంది.
वफादारी सीखनी है तो इन बेजुबान जानवरों से सीखो।
कैसे बच्चे को खरोंच तक नहीं आने दी है।
इंसान तो आजकल वफादारी भूल चुका है।अंधभक्त मिल जाएंगे लेकिन वफादार नहीं। pic.twitter.com/gU8I42FGeZ
— निखिल चौधरी (@albadi_jhindiyo) October 31, 2025
‘నిఖిల్ చౌదరి’ అనే ఖాతా నుండి X హ్యాండిల్ పేజీలో ఈ వీడియో పోస్ట్ చేశారు. వీడియో చూసిన ఒక నెటిజన్, “ఆవు బిడ్డను రక్షించడం ద్వారా తన విధేయతను చూపించింది” అని రాశాడు. మరికొంత మంది నెటిజన్లు రకరాకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఇది ఏఐ ద్వారా క్రియేట్ చేసిన వీడియో అంటూ పలువురు అనుమానిస్తున్నారు.