Viral Video: హమ్మయ్య.. బతికిపోయానని అనుకునేలోపే అటాక్‌… పామును అతి దారుణంగా వేటాడిన మొసలి

సోషల్‌ మీడియాలో జంతువులకు సంబంధించిన అనేక వీడియోలు హల్‌చల్‌ చేస్తుంటాయి. వాటిలో కొన్ని భయంకరంగా ఉంటే మరికొన్న నవ్వు తెప్పించేలా ఉంటాయి. పెంపుడు జంతువులకు సంబంధించిన వీడియోలు సరదాగా ఉంటాయి. ఇక అడవిలో ఉండే జంతువల వేటకు సంబంధించిన వీడియోలు మాత్రం భయకంరంగా ఉంటాయి. ఒక జంతువును...

Viral Video: హమ్మయ్య.. బతికిపోయానని అనుకునేలోపే అటాక్‌... పామును అతి దారుణంగా వేటాడిన మొసలి
Crocodile Attack Snake

Updated on: Nov 06, 2025 | 8:45 PM

సోషల్‌ మీడియాలో జంతువులకు సంబంధించిన అనేక వీడియోలు హల్‌చల్‌ చేస్తుంటాయి. వాటిలో కొన్ని భయంకరంగా ఉంటే మరికొన్న నవ్వు తెప్పించేలా ఉంటాయి. పెంపుడు జంతువులకు సంబంధించిన వీడియోలు సరదాగా ఉంటాయి. ఇక అడవిలో ఉండే జంతువల వేటకు సంబంధించిన వీడియోలు మాత్రం భయకంరంగా ఉంటాయి. ఒక జంతువును మరకొ జంతువు వేటాడే విధానం చూస్తుంటేనే ఒళ్లు జలదరిస్తుంటుంది. ఇక పాము, ముంగీస కొట్లాటకు సంబంధించిన వీడియోలు కూడా అనేకం వైరల్‌ అవుతుంటాయి. అలాంటి వీడియోనే ఒప్పుడు నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. అయితే ఈ వీడియోలో ముంగీస బదలు మొసలి పాముతో పోట్లాటకు దిగుతుంది.

సాధారణంగా నీటిలో మొసలికి ఉండే బలమే వేరు. అడవిలో ఏనుగు కన్నా నీటిలోని మొసలికి బలం ఎక్కువగా ఉంటుందంటారు. నీటిలో మొసలికి నోటికి చిక్కిందా ఎంత పెద్ద జంతువైనా దానికి ఆహారం కావాల్సిందే. అలాంటి మొసలి కంట ఓ పాము పడింది. దీంతో ఆ పామును వెంటపడి వెంట పడి మరీ వేటాడుతుంది మొసలి. ఈవీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

వీడియోలో ఒక సరస్సులా ఉన్న నీటి కుంటలో మొసలి ఉంటుంది దాని పక్కనుంచే ఓ పాము వెళుతుండం మొసలి కంటపడింది. దీంతో ఆ పామును మొసలి వేటాడుతుంది. ఒక్క ఉదుటున పామును నోట కరవడానికి ప్రయత్నిస్తుంది. కానీ పాము చాలా స్పీడ్‌గా స్పందించి చాకచ్యంగా తప్పించుకుంటుంది. అయితే మొసలి వెనక్కి తగ్గిందనుకుని పాము కాస్తా నెమ్మదిస్తుంది.

ఇదే అదనుగా భావించిన మొసలి చప్పుడు కాకుండా వెనక నుంచి వెళ్లి పామును నోట కరుస్తుంది. ఇదే సమయంలో అక్కడ ఓ గద్ద వాలడం కనిపిస్తుంది. పామును మొసలి నోట పట్టుకుని తిరిగి సరస్పులోకి ఈడ్చుకురావడంతో వీడియో ముగుస్తుంది. భయంకరంగా ఉన్న ఈ వీడియోను చూసిన నెటిజన్స్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ పెడుతున్నారు.

వీడియో చూడిండి: