Viral Video: వామ్మో… నీ ధైర్యానికో దండంరా బాబు… మాటల్లో కాదు చేతల్లో చూపించాడుగా

దారిలో పాము కనిపిస్తే ఎవరైనా ఏం చేస్తారు. చాలా మంది అయితే భయపడి అక్కడే అగిపోతారు. ఆ పాము అక్కడి నుంచి వెళ్లాక గానీ ముందుకు కదలరు. కానీ ఆస్ట్రేలియాలోని సన్‌షైన్ కోస్ట్‌లో ఒక దిగ్భ్రాంతికరమైన సంఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌...

Viral Video: వామ్మో... నీ ధైర్యానికో దండంరా బాబు... మాటల్లో కాదు చేతల్లో చూపించాడుగా
Byker Resque Python

Updated on: Sep 19, 2025 | 5:49 PM

దారిలో పాము కనిపిస్తే ఎవరైనా ఏం చేస్తారు. చాలా మంది అయితే భయపడి అక్కడే అగిపోతారు. ఆ పాము అక్కడి నుంచి వెళ్లాక గానీ ముందుకు కదలరు. కానీ ఆస్ట్రేలియాలోని సన్‌షైన్ కోస్ట్‌లో ఒక దిగ్భ్రాంతికరమైన సంఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఒక బైకర్ రోడ్డు మధ్యలో ఉన్న ఒక పెద్ద కొండచిలువను చూసినప్పుడు పూర్తి ధైర్యంతో తన చర్చను ప్రారంభించాడు. ఈ సంఘటన సన్‌షైన్ కోస్ట్ లోతట్టు ప్రాంతంలోని మాలెనీ సమీపంలో జరిగింది. అతని ధైర్యాన్ని స్థానికుడు వీడియో తీయడంతో అది వైరల్‌గా మారింది.

భారీ కొండచిలువ రద్దీగా ఉండే మార్గంలో ఉండటంతో కొన్ని క్షణాలు ట్రాఫిక్ జామ్‌ అయింది. రోడ్డు మీద పాము కనిపిండచంతో వాహనదారులంతా అక్కడే ఆగిపోయారు. కానీ ఈ ఒక్క బైకర్ మాత్రం ధైర్యం చేసి ముందడుగు వేశాడు. అతను తన మోటార్‌సైకిల్‌ను పక్కన పార్క్ చేసి, ఒట్టి చేతులతో పాము దగ్గరికి వెళ్లాడు. జాగ్రత్తగా దానిని పట్టుకున్నాడు.

సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోలో ఆ వ్యక్తి భారీ కొండచిలువను ప్రశాంతంగా ఎత్తి రోడ్డు నుండి తీసుకెళ్తున్నట్లు కనిపిస్తుంది. ఆ తర్వాత అతను ఆ కొండచిలువను సురక్షితంగా సమీపంలోని పొదల్లోకి వదిలేయడం వీడియోలో కనిపిస్తుంది.

వీడియో చూడండి:

ప్రొఫెషనల్ శిక్షణ లేకుండా అంత పరిమాణంలో ఉన్న కొండచిలువను హ్యాండిల్‌ చేయడం ప్రమాదకరం అయినప్పటికీ ఆ బైకర్‌ చూపిన ధైర్యాన్ని స్థానికులు ప్రశంసించారు. ఆ వ్యక్తి చర్యలు కొండచిలువ ప్రాణాలను కాపాడటమే కాకుండా రోడ్డుపై ప్రమాదాలను కూడా నివారించాయని వన్యప్రాణి నిపుణులు కూడా అభినందించారు.