Viral Video: యముడు దసరా హాలిడేస్‌లో ఉన్నట్టున్నాడు..లేదంటేనా… నొసటి మీద నసీబ్‌ రేఖ సక్కగుంటే ఇట్లా జరుగుతుందన్నమాట

నొసటి మీద నసీబ్‌ రేఖ సరిగ్గా లేకుంటే తాడే పామై కరుస్తుంది అనేది ఓ సామెత. అదే అదృష్టం ఉంటే మాత్రం రివర్స్‌ అయితుంటది. ఒక్కోసారి కొంత మంది వెంట్రుకవాసిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంటూ ఉంటారు. అదే అదృష్టం బాగా లేకుంటే కదలకుండా ఇంట్లో...

Viral Video: యముడు దసరా హాలిడేస్‌లో ఉన్నట్టున్నాడు..లేదంటేనా... నొసటి మీద నసీబ్‌ రేఖ సక్కగుంటే ఇట్లా జరుగుతుందన్నమాట
Man Accident Escape

Updated on: Sep 23, 2025 | 5:59 PM

నొసటి మీద నసీబ్‌ రేఖ సరిగ్గా లేకుంటే తాడే పామై కరుస్తుంది అనేది ఓ సామెత. అదే అదృష్టం ఉంటే మాత్రం రివర్స్‌ అయితుంటది. ఒక్కోసారి కొంత మంది వెంట్రుకవాసిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంటూ ఉంటారు. అదే అదృష్టం బాగా లేకుంటే కదలకుండా ఇంట్లో ఉన్నోడు సైతం ఏదో విధంగా చనిపోతుంటారు. అలాంటి వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంటాయి. ఓ వ్యక్తికి జస్ట్‌ రవ్వంత గ్యాప్‌లో ప్రాణాలు దక్కిన వీడియో ఒకటి హల్‌చల్ చేస్తోంది.

వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఒక వ్యక్తి ఒక వీధిలో నడుస్తూ ఉంటాడు. అకస్మాత్తుగా ఒక గోడ దగ్గరికి వచ్చి అవతలి వైపు తొంగి చూడటం కనిపిస్తుంటుంది. అక్కడ సరిగ్గా కనిపించడం లేదని కాస్త పక్కకు జరిగి తొంగి చూడటం కనిపిస్తుంటుంది. అయితే ఇక్కడే జరిగింది అసలు కథ. ఆ వ్యక్తి ముందుగా నిలబడిన చోట పేద్ద గోడ ఒక్కసారిగా అతని వైపు పడిపోయింది. దీంతో అతడు ఒక్క ఉదుటన పక్కకు జరిగాడు. అతడు ముందు నిలబడిన స్థానంలోనే ఉండుంటే మాత్రం కచ్చితంగా ప్రాణపాయం జరిగేంది. అతడు కేవలం వెంట్రుకవాసిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.

ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వైరల్ వీడియోను లక్షల మంది చూశారు. వేల మంది లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా ఫన్నీ కామెంట్స్‌ పెడుతున్నారు.

వీడియో చూడండి: