Viral Video: అవసరమా బ్రో.. అనవసరంగా కారు పాయె… వీడియో వైరల్ అయిన తర్వాత లంబోర్గిని స్వాధీనం

కొంతమంది వాహనదారులు రోడ్డు నిబంధనలు పాటించకుండా ప్రమాదాలను కొని తెచ్చుకుంటూ ఉంటారు. రూల్స్‌ క్రాస్‌ చేసి వాహనాలు నడుపుతూ ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలోకి నెట్టేస్తుంటారు. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. గంటకు 80 కిలోమీటర్ల స్పీడ్‌తో వెళ్లాల్సిన రోడ్డు మీద ఓ వాహనదారుడు...

Viral Video: అవసరమా బ్రో.. అనవసరంగా కారు పాయె... వీడియో వైరల్ అయిన తర్వాత లంబోర్గిని స్వాధీనం
High Speed Car Seized

Updated on: Dec 17, 2025 | 5:50 PM

కొంతమంది వాహనదారులు రోడ్డు నిబంధనలు పాటించకుండా ప్రమాదాలను కొని తెచ్చుకుంటూ ఉంటారు. రూల్స్‌ క్రాస్‌ చేసి వాహనాలు నడుపుతూ ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలోకి నెట్టేస్తుంటారు. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. గంటకు 80 కిలోమీటర్ల స్పీడ్‌తో వెళ్లాల్సిన రోడ్డు మీద ఓ వాహనదారుడు ఏకంగా 200 కి.మీ స్పీడ్‌తో ప్రయాణించి చిక్కుల్లో పడ్డాడు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోసల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ముంబైలోని బాంద్రా-వర్లి రహదారిపై ఓ వాహనదారుడు పరిమితికి మించిన స్పీడ్‌తో దూసుకెళ్లిన వీడియో నెట్టింట దూసుకెళుతోంది. లంబోర్గిని వేగం గంటకు 200 కి.మీ కంటే ఎక్కువగా ఉందని చూపించే వీడియో అప్‌లోడ్ అయిన తర్వాత లంబోర్గినిని వర్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైరల్ వీడియోలో లంబోర్గిని సముద్ర లింక్‌లో ట్రాఫిక్ గుండా వెళుతూ, అధిక వేగంతో కార్లను ప్రమాదకరంగా ఓవర్‌టేక్‌ చేసినట్లు చూపిస్తుంది.

ఫుటేజ్‌లో కనిపించే దాని రిజిస్ట్రేషన్ నంబర్ ద్వారా వాహనాన్ని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. వేగ పరిమితి గంటకు 80 కి.మీ. ఉన్న బాంద్రా వర్లి సీ లింక్‌లో లంబోర్గిని నడిపినట్లు తెలుస్తోంది. కారు యజమాని, కారు డీలర్ యొక్క పత్రాలను పోలీసులు ధృవీకరిస్తున్నారు.

వీడియో చూడండి: