Video: ఛీ.. ఏందయ్యా ఈ పిచ్చి! వీడియో కోసం అమ్మాయి ప్రాణాలు..

యువత రీల్స్ కోసం ప్రాణాలను లెక్కచేయకపోవడం ఆందోళన కలిగించే విషయం. రైళ్ల కింద పడుకోవడం, వేగంగా వెళ్తున్న రైళ్ల పక్కన నడవడం, నదుల్లో దూకడం వంటి ప్రమాదకరమైన పనులు చేస్తున్నారు. ఇటీవల, ఒక అమ్మాయి ప్రాణాలతో చెలగాటం ఆడిన వీడియో వైరల్ అయింది.

Video: ఛీ.. ఏందయ్యా ఈ పిచ్చి! వీడియో కోసం అమ్మాయి ప్రాణాలు..
Dangerous Reels Trend

Updated on: Sep 17, 2025 | 6:20 AM

రీల్స్‌ పిచ్చితో యువత ఏం చేస్తున్నారో వారికి కూడా అర్థం కావడం లేదు. రైళ్ల కింద పడుకోవడం, వేగంగా వెళ్తున్న రైళ్ల పక్కగా నడవడం, నదిలోకి దూకడం అబ్బో చెప్పుకుంటూ పోతే లెక్కలెనన్ని పిచ్చి పనులు చేస్తున్నారు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. సోషల్‌ మీడియాలో ఫైమస్‌ అవ్వాలని, ఫాలోవర్లను సంపాదించుకోవాలని, రీల్స్‌ పిచ్చితో చేస్తున్న చేష్టలు వార్తలుగా మారుతున్నా.. యువత ఆగడాలు మాత్రం తగ్గడం లేదు. తాజాగా కొందరు వీడియోల పిచ్చితో ఓ అమ్మాయి ప్రాణాలతో చెలగాటం ఆడారు.

కొంతమంది అబ్బాయిలు వంతెనపై నిలబడి ఉన్నారు. వారందరూ కలిసి ఏదో స్టంట్ కోసం సిద్ధమవుతున్నారు. అప్పుడు కెమెరా వంతెన నుండి తలక్రిందులుగా వేలాడుతున్న బాలుడిని చూపిస్తుంది. ఒక తాడు అతని పాదాలకు గట్టిగా కట్ట, కిందికి వదిలారు. క్రింద నదిలో బలమైన ప్రవాహంలో ఓ అమ్మాయి ఉంది. ఆమె మునిగిపోతున్నట్లు నటిస్తుంటే.. అతను కాపాడుతున్నట్లు నటిస్తున్నాడు. ఇదంతా ఒక రీల్ షూటింగ్ అని స్పష్టంగా తెలుస్తుంది. నీటిలో మునిగిపోతున్న అమ్మాయి, ఆమెను రక్షించడానికి సాహసం చేస్తున్న అబ్బాయి కాన్సెప్ట్‌తో ఈ పిచ్చి రీల్స్‌ చేశారు. పొరపాటునా ఆ తాడు తెగినా, ప్రవాహం పెరిగినా.. ఇద్దరు ప్రాణాలు నీటిలో కలిసినట్లే. దీంతో ఈ వీడియోను నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ వీడియోను @ChapraZila అనే ఖాతా ద్వారా Instagramలో షేర్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి