Viral News: విద్యార్థినికి గాలం వేసిన ఉపాధ్యాయుడు.. ఇద్దరూ జంప్.. చివరికి ఏమైందంటే..?

Viral News Update: ప్రేమకు వయస్సుతో సంబంధం లేదు. ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎవరిలో ప్రేమ పుడుతుందో ఎవరికీ తెలియదు. ఇదిలా ఉంటే కొన్ని..

Viral News: విద్యార్థినికి గాలం వేసిన ఉపాధ్యాయుడు.. ఇద్దరూ జంప్.. చివరికి ఏమైందంటే..?
Crime News

Edited By: Team Veegam

Updated on: Mar 20, 2021 | 11:17 AM

Viral News Update: ప్రేమకు వయస్సుతో సంబంధం లేదు. ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎవరిలో ప్రేమ పుడుతుందో ఎవరికీ తెలియదు. ఇదిలా ఉంటే కొన్ని షాకింగ్ ప్రేమ కథలను మీరు వినే ఉంటారు. అలాంటిదే రాజస్థాన్ రాష్ట్రంలో జరిగిన అదో విచిత్రమైనప్రేమగాథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. ఓ ఉపాధ్యాయుడు, మైనర్ విద్యార్ధినిపై మనసు పారేసుకున్నాడు. ముచ్చటైన మాటలతో ఇద్దరు ఒక్కటయ్యారు. ఇంకా ట్విస్ట్ ఏంటంటే.. ఇద్దరూ కూడా ఇంటి నుంచి పారిపోయారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన అక్కడి స్థానికులను ఒక్కసారిగా షాక్‌కు గురి చేసింది.

ఇక, వివరాల్లోకి వెళ్తే… అజ్మీర్‌కు చెందిన ఓ వ్యక్తి పిల్లలకు ట్యూషన్ చెబుతూ తన జీవనం సాగిస్తున్నాడు. ఇతగాడు తన శిష్యులలో ఒకరైన విద్యార్ధినితో ప్రేమలో పడ్డాడు. అంతేకాకుండా ఆ అమ్మాయితో కలిసి జంప్ అయ్యాడు. ఇద్దరూ పారిపోయి పెళ్లి చేసుకోవాలని అనుకున్నట్లు తెలుస్తోంది. అయితే, పెళ్లి జరగలేదు కానీ.. ఆత్మహత్యకు ప్రయత్నించారట. కానీ అందులోనూ విఫలం అయ్యారని సమాచారం.

ఇదిలావుంటే, ఆ అమ్మాయి కుటుంబం సదరు ఉపాధ్యాయుడిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఎట్టకేలకు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో, మైనర్ బాలికను ఆమె కుటుంబసభ్యులకు అప్పగించారు. టీచర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని ఇక్కడ చదవండి:

చుట్టూ భారీ అనకొండలు.. వాటితో ఆటలు.. ఇంతలోనే ఊహించని సంఘటన.. గగుర్పొడిచే వీడియో.!

భారీ పైథాన్‌తో ఫన్నీ గేమ్.. ప్రాణాల మీదకు తెచ్చుకున్న స్నేక్ క్యాచర్.. వైరల్ వీడియో.!

తలపై కొమ్ముతో భయంకర ఆకారం.. బెంబేలెత్తించే దృశ్యం.. ఇంతకీ అది దెయ్యమేనా.!