Viral Joke: మాస్క్ పెట్టుకోనివారిపై నెట్టింట పేలుతోన్న జోక్స్.. ప్రజంట్ ట్రెండింగ్‌లో ఉన్న జోక్ మీ కోసం

|

Apr 14, 2021 | 4:02 PM

మాస్క్ ఇప్పుడు మనుషులకు బ్రహ్మాస్త్రం. అవును మాస్క్ పెట్టుకుంటే కరోనాను మన దగ్గరికి రాకుండా కట్టడి చేయవచ్చు. కరోనా సెకండ్ వేవ్ ఇండియాలో కల్లోలం రేపుతోంది.

Viral Joke: మాస్క్ పెట్టుకోనివారిపై నెట్టింట పేలుతోన్న జోక్స్.. ప్రజంట్ ట్రెండింగ్‌లో ఉన్న జోక్ మీ కోసం
ప్రతీకాత్మక చిత్రం
Follow us on

మాస్క్ ఇప్పుడు మనుషులకు బ్రహ్మాస్త్రం. అవును మాస్క్ పెట్టుకుంటే కరోనాను మన దగ్గరికి రాకుండా కట్టడి చేయవచ్చు. కరోనా సెకండ్ వేవ్ ఇండియాలో కల్లోలం రేపుతోంది. కేసుల సంఖ్య ప్రమాదకరంగా పెరుగుతోంది. మరణాల సంఖ్య కూడా వణుకు పుట్టిస్తుంది. ఈ క్రమంలో జాగ్రత్తలు అత్యవసరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటించడం ప్రథమ కర్తవ్యంగా సూచిస్తున్నారు. అయినా కొందరు ఈ సూచనలను పట్టించుకోవడం లేదు. ఇష్టారీతిన మాస్కులు లేకుండా రోడ్లపై తిరుగుతున్నారు. ప్రభుత్వాలు ఫైన్లు వేస్తున్నా కూడా మనుషుల్లో మార్పు రావడం లేదు. ఈ క్రమంలో మాస్క్ ఆవశ్యకతను తెలిపే జోక్స్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి. తాజాగా మాస్క్ గురించి సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్న ఒక జోక్‌ను మీ ముందుకు పట్టుకొచ్చాం.

ట్రెండ్ అవుతోన్న జోక్…..

?A valid reason to wear a mask

Yama Dharmaraj to Chitragupta:
You went to the Earth, what happened?

Chitragupta:
People are wearing masks. I couldn’t recognize many of them. So, I brought only those who weren’t wearing a mask.

తెలుగు అనువాదం….

?మాస్క్ ధరించడం ఎందుకు అవసరమో తెలుసుకోండి

‘మీరు ఆయుష్సు నిండినవారిని తీసుకురావడానికి భూలోకానికి వెళ్ళారు, ఏం జరిగింది?’.. అని  యమ ధర్మరాజు చిత్రగుప్తడ్ని ప్రశ్నించాడు.

‘భూమిపై ప్రజలు మాస్కులు ధరిస్తున్నారు. నేను చాలా మందిని గుర్తించలేకపోయాను. దీంతో, మాస్కులు పెట్టుకోనివారిని మాత్రమే గుర్తించి తీసుకువచ్చాను’ అని చిత్రగుప్తుడు బదులిచ్చాడు.

Also Read: పురుషులే ఇలా… ఈ ఫోటో వెనుక అర్థం వేరు, పరమార్థం వేరు.. స్టోరీ చదివితే ఆ వ్యక్తులకు హ్యాట్సాఫ్ చెబుతారు

ఈ చెట్లు, మొక్కలు చాలా ప్రమాదకరమైనవి… టచ్ చేసినా చాలు ప్రాణాలు తీసేస్తాయి..