Watch Video: ఇదేం పిచ్చి..? మార్కెట్ మధ్యలో యువతి ‘భేషరమ్ రంగ్’ స్టెప్పులు.. వైరల్ అవుతున్న వీడియో..

రీల్స్‌ను సహజంగా ఇంట్లో లేదా ఎవరూ లేని చోట చేస్తుంటారు. కానీ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న వీడియో అందుకు పూర్తిగా విరుద్ధం. ఇటీవలి కాలంలో విడుదలై ట్రెండింగ్ పాటగా మారిన..

Watch Video: ఇదేం పిచ్చి..? మార్కెట్ మధ్యలో యువతి ‘భేషరమ్ రంగ్’ స్టెప్పులు.. వైరల్ అవుతున్న వీడియో..
Girl Dances To Besharam Rang On Crowded Market Area

Updated on: Dec 30, 2022 | 11:38 AM

ట్రెండింగ్ అవుతున్న పాటలకు యువతీయువకులు డ్యాన్స్ చేయడం, వాటిని రీల్స్‌గా తమ సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేయడం అనేది సర్వసాధారణం. ఈ రోజుల్లో ఇది ప్రతి ఇంటి రామాయణమే అన్న మాదిరిగా కూడా మారిపోయింది. అయితే ఇలా రీల్స్‌ను సహజంగా ఇంట్లో లేదా ఎవరూ లేని చోట చేస్తుంటారు. కానీ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న వీడియో అందుకు పూర్తిగా విరుద్ధం. ఇటీవలి కాలంలో వివాదంగా మారిన పఠాన్ సినిమాలోని ‘బేషరమ్ రంగ్’ పాటకు డ్యాన్స్‌లు వేసింది ఓ యువతి. ఇక్కడ విశేషమేమంటే.. మార్కెట్ మధ్యలో రోడ్డుకు అడ్డంగా నిలబడి డ్యాన్స్ వేసింది ఆ యువతి.

అయితే వీడియో పోస్ట్ అయిన ఖాతా ప్రకారం ఆమె కొలకత్తాకు చెందిన రుద్ర అని తెలుస్తోంది. ఇక ఆ వీడియోలో ఆమె భేషరమ్ రంగ్ పాటకు స్టెప్పులేస్తున్నప్పుడు ఆమె ఒంపుసొంపులను చూసేందుకు చాలా మంది అక్కడే నిలబడి చూస్తుండిపోయారు. అలాగే కొందరు అయితే ‘నడి రోడ్డు మీద ఇదేం గోల’ అన్నట్లుగా చిరాకు పడుతూ ఉండడాన్ని మనం చూడవచ్చు. దీనికి సంబంధించిన _sahelirudra_ అనే తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా రుద్ర ఈ వీడియోను‘పబ్లిక్ రియాక్షన్స్’ అనే కాప్షన్‌తో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ఇవి కూడా చదవండి

నెట్టింట వైరల్ అవుతున్న వీడియోను ఇక్కడ చూడండి.. 

మరిన్ని వైరల్ వార్తల కోసం క్లిక్‌ చేయండి.