Video: జస్ట్‌ మిస్‌… భక్తులకు తప్పిన పెను ప్రమాదం… లైవ్‌లో విరిగి పడిన కొండచరియలు.. ఒళ్లు జలదరించే వీడియో వైరల్‌

తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. పుణ్యక్షేత్రాలకు వెళ్లే ఘాట్‌ రోడ్లలో కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ క్రమంలో ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జేపీ చెరువు గ్రామ సమీపంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయానికి వచ్చే...

Video: జస్ట్‌ మిస్‌... భక్తులకు తప్పిన పెను ప్రమాదం... లైవ్‌లో విరిగి పడిన కొండచరియలు.. ఒళ్లు జలదరించే వీడియో వైరల్‌
Devotees Landslides

Updated on: Sep 13, 2025 | 7:06 PM

తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. పుణ్యక్షేత్రాలకు వెళ్లే ఘాట్‌ రోడ్లలో కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ క్రమంలో ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జేపీ చెరువు గ్రామ సమీపంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయానికి వచ్చే భక్తులకు పెద్ద ప్రమాదమే తప్పింది.

కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆలయ సమీపంలోని కొండచరియలు విరిగిపడ్డాయి. గమనించిన భక్తులు వెంటనే అక్కడినుంచి పరుగులు తీశారు. అటువైపు నుంచి వెళ్తున్న ఓ భక్తుడు ఆ పరిసర ప్రాంతాలను మొబైల్ ఫోన్ లో వీడియో చిత్రీకరిస్తుండగా కొండచరియలు విరిగి పడుతున్న దృశ్యాలు మొబైల్ ఫోన్ లో రికార్డ్ అయ్యాయి.

కొండచరియలు విరిగి పడుతున్న సమయంలో భక్తులు అప్రమత్తం కావడంతో ఎవరికి ఎటువంటి ప్రాణాపాయం జరగలేదు. వెంటనే అప్రమత్తమైన అధికారులు ముందస్తు జాగ్రత్తగా మధ్యాహ్నం నుంచి ఆలయ దర్శనాలను తాత్కాళికంగా నిలిపివేశారు.

కాగా, కొండ చరియలు విరిగిపడ్డ దృశ్యాలు భయంకరంగా ఉన్నాయి. వీడియో స్థానికంగా వైరల్‌గా మారింది.

వీడియో చూడండి:

Follow Us