Peacock: నెమలి ఈకలు తొలగిస్తూ యువకుడు టార్చర్‌.. బాధ భరించలేక మృతి.. కేసు నమోదు.. పరారీలో యువకుడు

మధ్యప్రదేశ్‌లోని కట్నీ జిల్లాలో బ్రతికి ఉన్న నెమలికి ఈకలు ఒక్కొక్కటిగా తొలగిస్తూ ఆ మూగజీవానికి నరకం చూపించాడా యువకుడు. బాధ తాళలేక చివరకు అది మరణించింది. వీడియో చూసిన నెటిజన్లు యువకుడిపై ఆగ్రహంతో ఊగిపోయారు

Peacock: నెమలి ఈకలు తొలగిస్తూ యువకుడు టార్చర్‌.. బాధ భరించలేక మృతి.. కేసు నమోదు.. పరారీలో యువకుడు
Peacock Video Viral

Updated on: May 22, 2023 | 10:24 AM

నెమలి అందమైన పక్షి. అంతేకాదు మన జాతీయ పక్షి కూడా. నెమలి పురి విప్పి నాట్యం చేస్తే ఎంతటివారైనా ఆస్వాదించకుండా ఉండలేరు. ఒంటినిండా అందమైన ఈకలతో అందరినీ ఆకట్టుకునే ఆ మూగజీవికి నరకం చూపించడో వ్యక్తి. చివరికి ఆ ప్రాణి అతని పైశాచిక చర్యకు బలైపోయింది. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతూ నెటిజన్లను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తోంది.

మధ్యప్రదేశ్‌లోని కట్నీ జిల్లాలో బ్రతికి ఉన్న నెమలికి ఈకలు ఒక్కొక్కటిగా తొలగిస్తూ ఆ మూగజీవానికి నరకం చూపించాడా యువకుడు. బాధ తాళలేక చివరకు అది మరణించింది. వీడియో చూసిన నెటిజన్లు యువకుడిపై ఆగ్రహంతో ఊగిపోయారు. అతడికి కఠిన శిక్ష వేయాలంటూ పోలీసులను డిమాండ్ చేశారు. వీడియోలో కనిపించిన బైక్ ఆధారంగా నిందితుడు అతుల్‌ను గుర్తించినట్టు డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ తెలిపారు.

అయితే, అరెస్ట్ చేసేందుకు అతని ఇంటికి వెళ్లగా యువకుడు లేడని, ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడని, అతడి ఆచూకీ తెలియగానే తమకు సమాచారం ఇవ్వాలని స్థానికులకు సూచించినట్టు తెలిపారు. ఇలాంటి చర్యలు ఉపేక్షించేది లేదని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వీడియో వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us