క్లాస్ రూమ్ లవ్ స్టోరీలు చాలా ఆసక్తిదాయకంగా ఉంటాయి. అది వేరే ప్రపంచం. అయితే ఏ క్లాస్ రూమ్ లేదా బయట కలిసిన ప్రేమ జంటలో అయినా దాదాపుగా అమ్మాయే అబ్బాయికి సేవలు చేస్తుంటుంది. ఖర్చుల విషయంలోనే అబ్బాయిలు పైచేయిగా ఉంటారు. కానీ అమ్మాయికి సేవలు చేసే అబ్బాయిలు అంటే.. దాదాపు అలాంటి ఘటనలు జరగవు. జరగినా లక్షకో, కోటికో ఒకరు ఉంటారు. అలా ప్రేమించిన అమ్మాయికి సేవలు చేస్తున్న అబ్బాయికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియా వైరల్ అవుతుంది. అవును మీరు విన్నది నిజమే. ఆ అమర ప్రేమికుడు తరగతి గదిలో తన ప్రియురాలి కాళ్లు పడుతున్నాడు. ఆ సమయంలో ఆమె తన ప్రియుడితో ఏదో చర్చిస్తోంది. ఇక దీనికి సంబంధించిన వీడియోను షూట్ చేసిన తరగతిలోని ఇతరులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఆ వీడియో కాస్త తెగ వైరల్ అవుతుంది.
bihari.broo అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి షేర్ అయిన వీడియోలో ఆ ప్రేమ జంట.. తరగతి గదిలోని బెంచ్‌కు ఎదురెదురుగా కూర్చుని ఉన్నారు. ఆ సమయంలో ప్రియురాలి ముందు పుస్తకం ఉండగా.. అబ్బాయి మాత్రం ఆమె కాళ్లను పడుతున్నాడు. ఇంకా ఆ సమయంలో వారిద్దరు చదువుకు సంబంధించిన విషయాలనో లేక తమ వ్యక్తిగత విషయాలనో చాలా సిరీయస్‌గా చర్చించుకుంటున్నారు. అయితే ఈ దృశ్యాలను చూసిన నెటిజన్లు ‘అమర ప్రేమికుడు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..