Trending Video: అద్దిరిపోయే అందంతో అద్భుతంగా డ్యాన్స్ వేసిన అమ్మాయిలు.. వీడియో చూడకపోతే చాలా మిస్సయినట్లే..

|

Jan 04, 2023 | 7:08 PM

బాక్సాఫీస్ వద్ద రికార్డులను సృష్టించడమే కాక సూపర్ హిట్ పేరు తెచ్చుకున్న పుష్ప సినిమాలోని పాటల మైకం నుంచి యువత ఇప్పటికీ బయట పడడంలేదు. ఇక ఆ సినిమాలో ‘ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా..’ అంటూ సమంత వేసిన

Trending Video: అద్దిరిపోయే అందంతో అద్భుతంగా డ్యాన్స్ వేసిన అమ్మాయిలు.. వీడియో చూడకపోతే చాలా మిస్సయినట్లే..
Girl Dancing For Oo Antava Mawa Song
Follow us on

అల్లు అర్జున్‌ను పాన్ ఇండియా స్టార్ హీరోగా చేసిన ‘పుష్ప ది రైజ్’ సినీ ప్రపంచాన్ని ఒక ఊపు ఊపేసింది. బాక్సాఫీస్ వద్ద రికార్డులను సృష్టించడమే కాక సూపర్ హిట్ పేరు తెచ్చుకున్న ఈ సినిమాలోని పాటల మైకం నుంచి యువత ఇప్పటికీ బయట పడడంలేదు. ఇక ఆ సినిమాలో ‘ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా..’ అంటూ సమంత వేసిన స్టెప్పులయితే ముసలివారిలో కూడా పిచ్చెక్కించేశాయి. సోషల్ మీడియాలో ఈ పాటకు సంబంధించిన రీల్స్, వీడియోలను మీరు ఇదివరకే చూసి ఉంటారు. ఇప్పుడు కూడా ఊ అంటావా మావా పాటకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది.

అయితే వైరల్ అవుతున్న వీడియోలో డ్యాన్స్ చేస్తున్న అమ్మాయిలు సమంత వేసిన స్టెప్పులనే కాక బెల్లీ డ్యాన్స్ కూడా చేశారు. దీంతో ఈ వీడియోను చూసిన నెటిజన్లు మళ్లీ చూడకుండా ఉండలేకపోతున్నారు. kkhushii_sharma అనే ఇన్‌స్టాగ్రామ్  ఖాతా ద్వారా షేర్ అయిన ఈ వీడియోలో.. పుష్ప సినిమాలోని ఊ అంటావా మావా పాటకు ఖుషీ శర్మ డ్యాన్స్ చేయడాన్ని మనం చూడవచ్చు. ఆమె చేసిన డ్యాన్స్, హావాభావాలు అద్భుతంగా ఉండడమే కాక నెటిజన్లను కట్టిపడేసేలా ఉన్నాయి. అలాగే  ఖుషీ శర్మ వేసే స్టెప్పులు నెటిజన్లను మంత్రముగ్ధులను కూడా చేసేస్తుంది.

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న ‘ఊ అంటావా మావా..’ వీడియోను ఇక్కడ చూడండి.. 

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..