Viral News: పాత అల్మారాను కొంటే భారీ నిధి బయటపడింది.. జిగేల్‌మనిపించే సంపదను చూసి..

|

Aug 13, 2023 | 1:26 PM

లాటరీ తగిలి కోటీశ్వరులు అయిపోయారని, డబ్బుల సంచి దొరికిందని రకరకాల వార్తలు చూస్తూనే ఉంటాం. ఇక్కడ అలాంటిదే జరిగింది. అయితే, ఇక్కడ వారికి లాటరీ తగల్లేదు కానీ, అంతకు మించిన విశేషం అని చెప్పుకోవచ్చు. ఓ పాత అల్మారా అమెరికాకు చెందిన వ్యక్తి కోటీశ్వరుడిని చేసింది. ఈ విషయాన్ని అతని భార్య వెల్లడించింది. ఆమె తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తన భర్త పాద వార్డ్‌రోబ్‌ను కొన్నాడని, అందులోంచి కోట్ల విలువైన రహస్య నిధి బయటపడిందని వెల్లడించింది. అది చూసి మా మతిపోయిందని,,

Viral News: పాత అల్మారాను కొంటే భారీ నిధి బయటపడింది.. జిగేల్‌మనిపించే సంపదను చూసి..
Us Dollars Found In Old Wardrobe
Follow us on

అదృష్టం ఎప్పుడు ఏ రూపంలో తలుపు తడుతుందో తెలియదు. మన దరికి చేరినా గుర్తించకపోతే ఏం చేయలేం. కానీ, వచ్చిన అదృష్టాన్ని, కలిసి వచ్చిన కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే.. దెబ్బకు దశ తిరిగిపోతుంది. ఓ వ్యక్తి జీవితంలో ఇదే జరిగింది. ఓ పాత అల్మారా ఓ వ్యక్తి జీవన గతినే మార్చేసింది. ఒక్క నైట్‌లోనే కరోడ్‌పతి అయ్యాడు. అతను చేసిందల్లా జస్ట్ 500 డాలర్లు పెట్టి ఓ పాత అల్మారా కొనుక్కోవడమే. ఆ అల్మారానే అతన్ని కోటీశ్వరుడిని చేసింది. ఇందుకు సంబంధించిన ఇంట్రస్టింగ్ వివరాలు ఇప్పుడు మనం చూద్దాం..

మనం చాలా సందర్భాల్లో వింటూనే ఉంటాం.. లాటరీ తగిలి కోటీశ్వరులు అయిపోయారని, డబ్బుల సంచి దొరికిందని రకరకాల వార్తలు చూస్తూనే ఉంటాం. ఇక్కడ అలాంటిదే జరిగింది. అయితే, ఇక్కడ వారికి లాటరీ తగల్లేదు కానీ, అంతకు మించిన విశేషం అని చెప్పుకోవచ్చు. ఓ పాత అల్మారా అమెరికాకు చెందిన వ్యక్తి కోటీశ్వరుడిని చేసింది. ఈ విషయాన్ని అతని భార్య వెల్లడించింది. ఆమె తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తన భర్త పాద వార్డ్‌రోబ్‌ను కొన్నాడని, అందులోంచి కోట్ల విలువైన రహస్య నిధి బయటపడిందని వెల్లడించింది. అది చూసి మా మతిపోయిందని సంతోషం వ్యక్తం చేసింది.

LadyBible వెబ్‌సైట్ కథనం ప్రకారం.. డాన్ డాట్సన్, అతని భార్య లారా సోషల్ మీడియాలో ఒక క్లిప్‌ను షేర్ చేశారు. ఒక మహిళ తమ వద్దకు వచ్చిందని, ఎవరూ ఆశ్చర్యపోని కథను చెప్పారు. ఆమె తెచ్చిన పాత అల్మారాను విక్రయించగా తాము కొనుగోలు చేశామని తెలిపారు. ఇందుకు 500 డార్లు ఖర్ చేశామన్నారు. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ. 41 వేలు. అయితే, ఈ పాత వార్డ్ రోబ్‌ను ఇంట్లోకి తీసుకెళ్లి పరిశీలించామన్నారు.

బయటపడ్డ రూ. 62 కోట్లు..

అయితే, ఈ వార్డ్‌రోబ్ చాలా బలంగా ఉండటంతో తెరవడం చాలా కష్టమైందని ఆ కపుల్స్ చెప్పారు. దాంతో డోర్ ఓపెన్ చేయడానికి మరొక వ్యక్తిని పిలిచారు. అతనికి కూడా ఆ సేఫ్ ఓపెన్ చేయడం సాధ్యపడలేదు. ఈ క్రమంలో ముగ్గురూ కలిసి సేఫ్‌ను ఎలాగోలా తెరిచారు. అది ఓపెన్ చేయగానే.. అందులో 7.5 మిలియన్ డార్లు అంటే దాదాపు రూ. 62 కోట్లు నగదు జిగేల్ మన్నది.

5 కోట్ల ఆఫర్..

అయితే, ఈ నగదు దొరికిన విషయంపై ఈ దంపతులను వార్డ్ రోబ్ ఓనర్, న్యాయవాది సంప్రదించారు. ఆ డబ్బును తనకు అప్పగించాలని, ప్రతిఫలంగా 6 లక్షల డాలర్లు అంటే దాదాపు రూ. 5 కోట్లు ఇస్తానని ఆఫర్ ఇచ్చాడు. దానికి వారు నిరాకరించారు. ఆ తరువాత సదరు న్యాయవాది ఫైనల్‌గా 10 కోట్లు ఇస్తానని ఆఫర్ ఇచ్చాడు. దాంతో ఆ దంపతులు అందుకు అంగీకరించారు. వారు కొనుగోలు చేసిన వార్డ్ రోబ్‌ను తిరిగి ఇచ్చేసింది. అంటే కేవలం 500 డాలర్లతో కొనుగోలు చేసిన వార్డ్ రోబ్.. 10 కోట్లకు యజమానిని చేసింది. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

మరిన్ని హ్యూమన్ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..