Viral News: అబ్బా ఏం ప్లాన్ చేశావక్కా.. పాములా మారినట్టు మాస్టార్ ప్లాన్.. చివరకు జరిగింది తెలిసి..

ఆ రోజూ సోమవారం పోలీస్ స్టేషన్‌ మొత్తం హడావుడిగా ఉంది. ఇంతలో స్టేషన్‌లో ఉన్న ఫోన్‌ మోగింది. ఫోన్‌ లిప్ట్ చేసిన పోలీసులకు వణుకుతున్న స్వరంతో ఓ లేడీ గొంతు వినిపించింది. సార్ నా కూతురు పాములా మారిపోయింది.. దయచేసి ఆమెను కనిపెట్టడంలో సహాయం చేయండి అని ఆమె కోరింది. అది విన్న పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే ఆమె చెప్పిన అడ్రస్‌ వెళ్లి చూడగా నిజంగానే యువతి బెడ్‌పై వాళ్లకు పాము పూసం కనిపించింది. అది చూసిన పోలీసులు ఒక్కసారిగా నిజంగానే ఆమె పాములా మారిందా ఏంటి అనుకున్నారు. చివరకు ఘటనపై మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

Viral News: అబ్బా ఏం ప్లాన్ చేశావక్కా.. పాములా మారినట్టు మాస్టార్ ప్లాన్.. చివరకు జరిగింది తెలిసి..
Uttar Pradesh Naagin Case

Updated on: Feb 12, 2026 | 6:30 AM

ఉత్తరప్రదేశ్‌లోని ఔరైయా జిల్లాలో వింత ఘటన వెలుగు చూసింది. ఓ మహిళ పోలీసులకు ఫోన్ చేసి తన కూతురు పాములా మారిపోయిందని తనకు సహాయం చేయాలని కోరింది. దీంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితురాలి ఇంటిని పరిశీలించగా వాళ్లకు యువతి బెడ్‌పై పాము పూసం కనిపించింది. అయితే ఇటీవల తన కుమార్తె మౌన్‌పురిలోని శేషనాగ్ ఆలయానికి వెళ్ళిందని.. అక్కడి నుండి వచ్చేప్పుడు ఒక శేషనాగ్ విగ్రహాన్ని తీసుకువచ్చిందని యువతి తల్లి పోలీసులకు చెప్పింది. ఆ ఆలయం నుండి వచ్చినప్పటి నుంచి తన కుమార్తే నిత్యం పాముల గురించి కలలు కంటోందని.. తాను నిద్రపోయేప్పుడు ఓ పాము వచ్చి తన కుమార్తె పక్కన పడుకునేదనని ఆమె చెప్పుకొచ్చింది. అయితే తన కుమార్తె కనిపించకుండా పోయిన రోజు నుంచి ఆమె తనతో పాటు తీసుకొచ్చిన శేషనాగ్ విగ్రహం కూడా కనిపించట్లేదని తెలిపింది.

యువతి తల్లి చెప్పిన మాటలపై అనుమానం వచ్చిన పోలీసులు ఘటనపై మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం స్టార్ చేశారు. యవతి గురించి స్థానికుల ద్వారా వివరాలు సేకరించారు. ఈ క్రమంలో అయితే పోలీసుల షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. యువతి గత కొంతకాలంలో ఓ యువకుడితో మాట్లాడుతూ ఉంటేదని.. ఆమె గత మూడు నెలలుగా ఇంటి నుండి పారిపోవాలని ప్లాన్ చేస్తోందని పోలీసులు తెలుసుకున్నారు. అందుకు తగ్గట్టుగానే ఆమె ఓ కథను క్రియేట్ చేసి.. కుటుంబ సభ్యులను నమ్మించేందుకు అటవీప్రాంతంలోకి వెళ్లి ఓ పాము పూసానిన్ని తీసుకొచ్చిందని పోలీసులు స్థానికుల ద్వారా తెలుసుకున్నారు.

తాను పాముల మారిపోయినట్టు నటిచేందుకు తన బెడ్‌పై పాము పూసాన్ని పడేడి అనంతరం ఇంట్లో నుంచి పారిపోయి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. యువతి ఫోన్‌లో మాట్లాడే వ్యక్తి వివరాల తెలుసుకునే పనిలో ఉన్నామని.. త్వరలోనే ఇద్దరిని పట్టుకొంటామని పోలీసులు చెబుతున్నట్టు తెలుస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.