Trending Video: వైరల్ అవుతున్న చీమల చట్నీ.. తిన్నారంటే అన్ని రోగాలు ఫట్..

|

Jul 06, 2024 | 5:42 PM

చీమను చూసి క్రమశిక్షణ నేర్చు కొమ్మని పెద్దలు చెబుతూ ఉంటారు. చీమలు క్రమ శిక్షణకు పెట్టింది పేరు. ఏ కాలంలో ఎలా బ్రతకాలో వాటికి బాగా తెలుసు. అయితే ఎంత క్రమ శిక్షణగా ఉన్న చీమ అయినా.. మనకు కనిపిస్తే బ్రతుకుతాయా.. ఏ చీమల మందు కానీ.. స్ప్రే కానీ చేసి చంపేస్తాం. ఇప్పుడు చీమల టాపిక్ ఎందుకా అంటారా.. మనం మాట్లాడుకునేదే చీమల చట్నీ గురించి కదా. చీమల చట్నీ గురించి ఇది వరకే వినే ఉంటారు. కానీ చీమల చట్నీ ఎలా చేయాలో..

Trending Video: వైరల్ అవుతున్న చీమల చట్నీ.. తిన్నారంటే అన్ని రోగాలు ఫట్..
Trending Video
Follow us on

చీమను చూసి క్రమశిక్షణ నేర్చు కొమ్మని పెద్దలు చెబుతూ ఉంటారు. చీమలు క్రమ శిక్షణకు పెట్టింది పేరు. ఏ కాలంలో ఎలా బ్రతకాలో వాటికి బాగా తెలుసు. అయితే ఎంత క్రమ శిక్షణగా ఉన్న చీమ అయినా.. మనకు కనిపిస్తే బ్రతుకుతాయా.. ఏ చీమల మందు కానీ.. స్ప్రే కానీ చేసి చంపేస్తాం. ఇప్పుడు చీమల టాపిక్ ఎందుకా అంటారా.. మనం మాట్లాడుకునేదే చీమల చట్నీ గురించి కదా. చీమల చట్నీ గురించి ఇది వరకే వినే ఉంటారు. కానీ చీమల చట్నీ ఎలా చేయాలో చేయడం ఎలాగో ఎప్పుడైనా వీడియో చూశారా. మీ కోసమే ఆ వీడియో తీసుకొచ్చాం.

సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది. ఇప్పటి వరకూ ఈ వీడియోను 25 మిలియన్ల మంది చూశారు. లక్షల్లో లైకులు, షేర్లు, కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఈ వీడియోను @foodguyrishi ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. షేర్ చేసిన కొద్ది రోజుల్లోనే ఈ వీడియో ట్రెండింగ‌్‌గా మారింది. ఎర్రల చీమల చట్నీలు ఎలా తయారు చేస్తారో.. వీడియోలో ఉంటే.. వ్లాగర్ వాయిస్ ఓవర్ ఇస్తుంది. ఇప్పుడు ఈ వీడియో ఎంతో మందిని ఆకట్టుకుంది. ఇంతకీ ఇప్పుడు ఎర్ర చీమల చట్నీ ఎలా తయారు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియోలో..

ఈ వీడియోలో ఒక మహిళ ఒక కర్ర.. బకెట్ పట్టుకుని మామిడి చెట్టు దగ్గరకు వెళ్లింది. అక్కడ ఒక చెట్టు భాగంలో చీమలు బాగా పట్టి ఉంటాయి. దాన్ని తెంపి వాటర్ ఉన్న ఒక బకెట్‌లోకి వేస్తుంది. వెంటనే ఆ చీమల్ని కడిగి.. ఒక వస్త్రంపై ఆర పెడుతుంది. ఆ తర్వాత పచ్చడి చేసే రోటిలో ఎండు మిర్చి, పచ్చి ఉల్లిపాయ, వెల్లుల్లి, ఉప్పు వేసి బాగా నూరుతుంది. ఇది బాగా పేస్టులా అయ్యాక అందులో ఆరబెట్టిన చీమల్ని కూడా వేసి బాగా రుబ్బుతుంది. అంతే ఎంతో రుచిగా ఉండే ఎర్ర చీమల చట్నీ సిద్ధం. ఈ చట్నీని అక్కడ ఉన్న చిన్నా, పెద్దా అందరూ తినేస్తున్నారు. ఇలా ఎర్ర చీమల చట్నీ తినడం వల్ల అనారోగ్య సమస్యలు రావని వాళ్లు నమ్ముతున్నారు.