రాజస్థాన్ అల్వార్‌కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కచూరీ కొనేందుకు ట్రైన్ ఆపాడు ఓ లోకో పైలట్. దావుద్పుర్ గేట్ వద్ద ఈ ఘటన జరిగింది. రైలు ఆపగా.. ఓ వ్యక్తి అక్కడికి వచ్చి డ్రైవర్‌కు కచోడీలు ఇచ్చి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ట్రైన్ మళ్లీ స్టార్ట్ అయింది. నిబంధనల ప్రకారం.. ఆ క్రాసింగ్ దగ్గర రైలు ఆపకూడదు. ఇదంతా నిమిషం వ్యవధిలోనే జరిగిపోయినా.. గేట్ బయట ఎదురుచూస్తున్న వాహనదారులు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత కచూరి కొంటున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ సంచలనంగా మారుతున్నాయి. ఆ వీడియో యూట్యూబ్‌లో వైరల్‌గా మారింది. రైల్వే లైన్ పక్కనే ఓ వ్యక్తి నిలబడి ఉండటం కనిపించింది. తన ఎదురుగా రాగానే డ్రైవర్ అతి తక్కువ వేగంతో రైలును సరిగ్గా అతని పక్కనే ఆపేశాడు. అప్పుడు లైన్ పక్కన నిలబడి ఉన్న వ్యక్తి ఇంజిన్ లోపల ఉన్న లోకో పైలట్‌కు కచోరీలతో ఉన్న ఒక ప్యాకెట్ ఇచ్చాడు. ఆ ప్యాకెట్‌లో కచూరీ ఉందని తర్వాత తెలిసింది. అయితే ప్యాకెట్ తీసుకున్న తర్వాత రైలు అక్కడి నుంచి వెళ్లి పోయింది.
కచూరీ కొనడానికి డ్రైవర్ రైలును ఆపాడు, ఆ వైరల్ వీడియో చూడండి
వీడియో వైరల్ అయిన వెంటనే జైపూర్ డివిజనల్ రైల్వే మేనేజర్ (DRM) ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. ఇద్దరు లోకో పైలట్‌లు, ఇద్దరు వ్యక్తులు, మరో వ్యక్తిని సస్పెండ్ చేశారు. తదుపరి విచారణలో తగిన చర్యలు తీసుకుంటామన్నారు. వీరిని ప్రాథమిక విచారణలో భాగంగా సస్పెండ్ చేసినట్లుగా వెల్లడించారు. ఆశ్చర్యకరమైన సంగతి మరొకటి ఉంది.. ఇలా జరగడం ఇది కొత్తది కాదు. ఇలా చాలాసారు అల్వార్‌లోని దౌద్‌పూర్ గేట్ వద్ద రైలు ఆగడం కచూరీలు కొనుగోలు చేయడం జరుగుతుదని స్థానికులు అంటున్నారు. అయితే ఈ ఒక్క రైలు మాత్రమే కాకుండా ప్రతి రోజు ఇలాంటి రైళ్లు చాలా ఆగుతాయన్నారు.
ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్ అయ్యారు. వారిలో నవ్వుకుంటున్నారు. డ్రైవర్ ఆకలితో ఉన్నాడని చాలామంది చమత్కరించారు. ఇంట్లో ఎవరో ఒకరు ఈ పని చేసి ఉంటారని కొందరు అంటున్నారు. గతేడాది పాకిస్థాన్‌లో ఇలాంటి ఘటనే జరిగిన సంగతి తెలిసిందే. పెరుగు కొనేందుకు డ్రైవర్ రైలును మధ్యలో ఆపేశాడు.
అయితే అంతకు ముందు రైలును ఆపడంపై చర్చ జరగలేదు. ఈ ఘటన పాకిస్థాన్‌లోని కన్హా రైల్వే స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్‌గా మారింది. డ్రైవరు సహాయకుడు రైలు దిగి రోడ్డు పక్కన ఉన్న దుకాణంలో పెరుగు కొనుక్కోవడం కనిపించింది. తర్వాత మళ్లీ రైలు ఎక్కాడు. ఈ ఘటనలో రైలు డ్రైవర్‌తో పాటు అతని సహాయకుడిని కూడా సస్పెండ్ చేశారు.
ఇవి కూడా చదవండి: Nawab Malik: మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ అరెస్ట్.. దావూద్ ఇబ్రహీంతో ఉన్న లింకులపై ఈడీ ఆరా..
Prashant Kishor: యూపీ ఎన్నికల్లో గెలుపు ఎవరిది?.. ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు..