Viral: కడుపులో అదే పనిగా గడబిడ – ఆస్పత్రికి వెళ్లగా CT స్కాన్ తీసిన వైద్యులు షాక్

పొరపాటున జరిగిన చిన్న విషయమే దశాబ్దాల తర్వాత పెద్ద కథగా మారింది. చివరకు డాక్టర్ల జోక్యంతో ఆ సమస్యకు పరిష్కారం లభించింది. ఓ వ్యక్తి కడుపులో గడబిడగా ఉందని ఆస్పత్రికి వెళ్లాడు. డాక్టర్లు టెస్టులు అన్నీ చేశారు. అయితే CT స్కాన్ రిపోర్ట్ చూసి కంగుతిన్నారు.

Viral: కడుపులో అదే పనిగా గడబిడ - ఆస్పత్రికి వెళ్లగా CT స్కాన్ తీసిన వైద్యులు షాక్
CT Scan Report

Updated on: Jun 24, 2025 | 1:37 PM

పిల్లలు చిన్న వయసులో ఏదో ఒక తుంటరి పనులు చేస్తూనే ఉంటారు. కొన్నిసార్లు అవీ ఇవీ మింగుతూ ఉంటారు. ఇంట్లో పెద్దవాళ్లు తిడతారని ఆ విషయం చెప్పరు. అయితే అది ప్రమాదంగా మారవచ్చు. అప్పటికప్పుడు కాకపోయినా కొన్నేళ్ల తర్వాత అయిన దాని వలన మీకు సమస్య కలగవచ్చు. తాజాగా చైనాలో అలాంటి ఘటనే వెలుగుచూసింది.

చైనాలో 64 ఏళ్ల యాంగ్ జీవితంలో ఒక విచిత్రమైన ఘటన జరిగింది. 12 ఏళ్ల వయసులో అతను పొరపాటున టూత్ బ్రెష్ మింగాడు. విషయం చెబితే తల్లిదండ్రులు తిడతారని భయపడి ఎవరికీ చెప్పలేదు. మలం గుండా అదే బయటకు వస్తుందని భావించాడు. కానీ రాలేదు. ఆ తర్వాత పెద్ద సమస్య లేకపోవడంతో అతను కూడా దాని గురించి పట్టించుకోవడం మానేశాడు. 52 ఏళ్ల పాటు ఏ ఇబ్బంది లేకుండా ప్రశాంతగా గడిపాడు. కానీ ఇటీవల పొట్టలో అసౌకర్యంగా అనిపించడంతో ఆస్పత్రికి వెళ్లాడు. డాక్టర్లు స్కాన్ చేస్తే ఆశ్చర్యంగా 17 సెం.మీ టూత్ బ్రెష్ అతని చిన్న ప్రేగు (డ్యూఓడినమ్)లో ఉండటం చూసి వైద్యులు కంగుతిన్నారు. 80 నిమిషాల ఎండోస్కోపీ సర్జరీతో డాక్టర్లు ఆ టూత్ బ్రష్‌ను తొలగించారు. ఇప్పుడు యాంగ్ పూర్తిగా కోలుకున్నారని ఆపరేషన్ చేసిన డాక్టర్లు తెలిపారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..