Viral Video: అరుదైన వ్యాధితో చిన్నారి.. అచ్చం అల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌లా.. నెట్టింట్లో ఫొటోలు, వీడియోలు వైరల్‌

|

Jul 25, 2022 | 6:13 PM

Uncombable Hair Syndrome: అనకంబబుల్ హెయిర్ సిండ్రోమ్.. ప్రపంచంలో అత్యంత అరుదైన వ్యాధుల్లో ఇది కూడా ఒకటి. ఎంతలా అంటే ఈ విశ్వంలో దీనితో బాధపడుతున్న వారు కేవలం 10 మంది మాత్రమే ఉంటారు. గతేడాది డేవిడ్‌ అనే ..

Viral Video: అరుదైన వ్యాధితో చిన్నారి.. అచ్చం అల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌లా.. నెట్టింట్లో ఫొటోలు, వీడియోలు వైరల్‌
Uncombable Hair Syndrome
Follow us on

Uncombable Hair Syndrome: అనకంబబుల్ హెయిర్ సిండ్రోమ్.. ప్రపంచంలో అత్యంత అరుదైన వ్యాధుల్లో ఇది కూడా ఒకటి. ఎంతలా అంటే ఈ విశ్వంలో దీనితో బాధపడుతున్న వారు కేవలం 10 మంది మాత్రమే ఉంటారు. గతేడాది డేవిడ్‌ అనే బాలుడు ఈ అరుదైన వ్యాధితో జన్మించాడు. పొడవాటి కాపర్‌ కలర్‌ జుట్టుతో ఆ బాబు పుట్టడంతో తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. చూడ్డానికి ఆ బాబు అచ్చం అచ్చం యూకే మాజీ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌లా ఉంటాడని ఆ పిల్లాడి తల్లిదండ్రులు తెలిపారు. ఇప్పుడు ఇదే సమస్యతో మరో చిన్నారి ఈ భూమ్మీదకు అడుగుపెట్టింది. ఆ పాప పేరు లైలా డేవిస్. ప్రస్తుతం ఈ చిన్నారి చూడడానికి అచ్చం అల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌లా ఉంటోంది. అందుకే ఈ పాప ఫొటోలు నెట్టింట్లో బాగా ట్రెండ్‌ అవుతున్నాయి.

కాగా యూకేకు చెందిన షార్లెట్ డేవిస్, కెవిన్‌ల గారాల పట్టినే ఈ లైలా. పుట్టుకతోనే అనకంబబుల్ హెయిర్ సిండ్రోమ్‌తో బాధపడుతోన్న ఈ చిన్నారి తల వెంట్రుక‌లు, పొడిగా.. వెండి రంగులో గజిబిజిగా ఉన్నాయి. అసలు దువ్వెన పెట్టేందుకు కూడా వీలులేకుండా వెంట్రుకలు నిటారుగా గుబురు గుబురుగా ఉన్నాయి. కాగా తమ కూతురి ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తోంది షార్లెట్ డేవిస్. ఇవి నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. లైలా ఎంతో అందంగా ఉంది. అల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ను మళ్లీ చూసినట్టు ఉంది అంటూ కామెంట్లు కురిపిస్తున్నారు. మరికొందరు బోరిస్‌ జాన్సన్‌తో పోలుస్తూ రిప్లైలు ఇస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..