Viral: ప్రపంచంలోనే ఎత్తైన ఆలయం.. ఎక్కడో కాదు.. మన ఇండియాలోనే..

|

Jul 11, 2023 | 9:00 PM

ప్రపంచలోనే అత్యంత ఎత్తైన ఆలయం మన దేశంలో నిర్మితమవుతోంది. గుజరాత్లోని జస్పూర్​ గ్రామంలో ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు. 504 అడుగుల..

Viral: ప్రపంచంలోనే ఎత్తైన ఆలయం.. ఎక్కడో కాదు.. మన ఇండియాలోనే..
Mataji Temple
Follow us on

ప్రపంచలోనే అత్యంత ఎత్తైన ఆలయం మన దేశంలో నిర్మితమవుతోంది. గుజరాత్లోని జస్పూర్​ గ్రామంలో ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు. 504 అడుగుల ఎత్తుతో నిర్మిస్తున్న ఈ ఆలయ నిర్మాణానికి సుమారు వెయ్యికోట్లు ఖర్చు చేస్తున్నారు. వచ్చే ఐదేళ్లలో ఈ గుడిని భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చేలా నిర్వాహకులు కసరత్తు చేస్తున్నారు. విశ్వ ఉమియా ధామ్​ట్రస్ట్ ఈ ఆలయ నిర్మాణాన్ని చేపట్టింది. తాజాగా పాటీదార్​ సమాజానికి చెందిన ట్రస్టు సభ్యులు ప్రత్యేకంగా సమావేశమై ఆలయ నిర్మాణశైలిపై చర్చించారు. ఈ ఆలయ ఆవరణలో అతిపెద్ద ట్రీ మ్యూజియంను ఏర్పాటు చేయనున్నారు.

సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ ఎత్తు 597 అడుగులు. 96 అడుగులు తక్కువగా 501 అడుగుల ఎత్తులో నిర్మిస్తున్న ఆలయంలో భూకంపాలు, వరదలను సైతం తట్టుకునేలా ఇండో-జర్మన్​ సాంకేతికతను వినియోగిస్తున్నారు. ఈ ఆలయంలోని 270 అడుగుల వద్ద గ్యాలరీ పాయింట్​ను ఏర్పాటు చేయనున్నారు. ఉమియా మాతాజీ సింహాసనాన్ని 51 అడుగుల ఎత్తులో ప్రతిష్ఠించనున్నారు.

ఉమియా మాతాజీ విగ్రహంతో పాటు పరానా శివలింగాన్ని సైతం ఏర్పాటు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వృద్ధులు సైతం ఈ ఆలయాన్ని దర్శించుకునేలా ఎస్కలేటర్​ను ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే ఈ ఆలయానికి వచ్చే భక్తులు తమ వాహనాలను పార్క్ చేసుకునేందుకు వీలుగా ప్రత్యేక పార్కింగ్‌ను ఏర్పాటు చేస్తోంది. సుమారు 3,500 వాహనాలు పార్క్ చేసేలా పార్కింగ్ స్థలాన్ని సిద్ధం చేస్తున్నారు. ఇది రాష్ట్రంలోనే అతి పెద్ద పార్కింగ్​ ప్రదేశం అవుతుందని నిర్వాహకులు చెప్పారు.