ఫోటో పజిల్స్.. ఈ మధ్యకాలం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న సబ్జెక్ట్. వైరల్ వీడియోలను తరచూ వీక్షించే నెటిజన్లు వీటిపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఆ ఫోటోల్లో ఏముంది.? ఉంటే అదెక్కడుందో.? కనుక్కునేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. కొంతమంది అయితే తగ్గేదేలే అన్నట్లుగా ఓ పట్టు పడుతున్నారు. ఫోటో పజిల్స్ కంటూ సోషల్ మీడియాలో ప్రత్యేకంగా పేజీలు కూడా ఉన్నాయి. కొన్నిసార్లు పాత ఫోటోలు కూడా మరోసారి నెట్టింట చక్కర్లు కొడుతుంటాయి. ఏదైతేనేం.. మన మెదడును చురుకుగా ఉంచి.. కళ్లకు పని చెప్పే ఏ పజిల్ అయినా మనం ఓ సవాల్‌గా తీసుకుంటాం. ఈ కోవలోనే తాజాగా ఓ ఫోటో పజిల్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దానిలో పామును కనిపెట్టేందుకు నెటిజన్లు తమ బుర్రకు పని చెబుతున్నారు. పైన పేర్కొన్న ఫోటోలో పాము దాగుంది. అదెక్కడుందో మీరు కనిపెట్టాలి. చూడటానికి పార్క్‌లా ఉన్న ఆ ప్రాంతంలో పాము ఎంచక్కా చుట్టుకుని సేద తీరుతోంది. చుట్టూ పచ్చని గుబురుగా ఎదిగిన మొక్కలతో ఉన్న ఆ ఏరియాలోనే ఓ విషపూరితమైన సర్పం ఉంది. ఇది కొంచెం ఈజీ పజిల్. చిటికెలో పట్టేయొచ్చు. లేట్ ఎందుకు మీరు కూడా మీ కళ్లకు పదును పెట్టండి.. ఆ పాము ఎక్కడుందో కనిపెట్టండి.
Here is the answer.. pic.twitter.com/W8HPSMNdZU
— telugufunworld (@telugufunworld) March 4, 2022