Viral Photo: 7గురు వ్యక్తులు.. ఓ పిల్లి.. ఈ ఫోటోలో మీకు కనిపిస్తే.. మీ మెదడుకు పదునున్నట్లే!

ఇటీవల సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూషన్(Optical Illusion) చిత్రాలు బిగ్గెస్ట్ ట్రెండ్ సృష్టిస్తున్నాయి. ఎక్కడ చూసినా అవే..

Viral Photo: 7గురు వ్యక్తులు.. ఓ పిల్లి.. ఈ ఫోటోలో మీకు కనిపిస్తే.. మీ మెదడుకు పదునున్నట్లే!
Optical Illusion

Updated on: Apr 22, 2022 | 8:21 PM

ఇటీవల సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూషన్(Optical Illusion) చిత్రాలు బిగ్గెస్ట్ ట్రెండ్ సృష్టిస్తున్నాయి. ఎక్కడ చూసినా అవే.. నెటిజన్లకు సవాల్ విసురుతూ.. వారి కళ్లకు పదును పెడుతున్నాయి. ఇంటర్నెట్‌లో కొన్ని ఫోటోలు మన కళ్లను మాయ చేస్తున్నాయంటే.. అది కచ్చితంగా చిత్రకారుడి మాయో.. లేక కెమెరా మ్యాజికో అవ్వక మానదు. మరి లేట్ ఎందుకు.. మీకు సవాళ్లు ఇష్టమైతే.. కింద ఫోటోను ఓ పట్టు పట్టండి.

మెదడుకు మేత వేయడమే కాదు.. కళ్లకు కూడా పదునుపెట్టే ఓ ఫోటో ప్రస్తుతం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. ‘డార్క్ సైడీ’ అనే నెటిజన్ టిక్‌టాక్‌లో షేర్ చేసిన ఈ ఫోటో నెటిజన్లను తికమక పెడుతోంది. పైన పేర్కొన్న ఫోటోలో 7గురి వ్యక్తులను.. ఓ పిల్లిని చూడగలిగితే మీ మైండ్ షార్ప్‌గా ఉన్నట్లేనని అతడు చెప్పుకొస్తున్నాడు.

.
.
.
.
.
.
.
.

లేదు.. మీకు 6గురు వ్యక్తులు కనిపిస్తున్నారా.? అయినా పర్లేదు.. మీ మెదడు సరిగ్గా పని చేస్తున్నట్లే లెక్క. కానీ మీరు 2 లేదా 3 వ్యక్తులను చూసినట్లయితే.. కచ్చితంగా దగ్గరలోని న్యూరాలజిస్ట్‌ను సంప్రదించాల్సిందేనని చమత్కరించాడు. ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిలో ఉన్నవారిని కనిపెట్టేందుకు నెటిజన్లు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. కొంతమంది 7గురు వ్యక్తులను, ఓ పిల్లిని కనిపెడితే.. మరికొంతమంది తల పట్టుకున్నారు. మరి మీరూ ఓసారి ట్రై చేయండి.. సమాధానం దొరక్కపోతే కింద ఫోటోలో ఆన్సర్ చూడండి.

Loading...
Unable to load recommendations.
Follow Us