Shocking Video: తట్టుకునే దమ్ముంటేనే వీడియో చూడండి.. ప్రళయంలా దూసుకొస్తున్న ‘లావా’ ప్రవాహం..

Shocking Video: కొందరు చిన్నపాటి నీటి ప్రవాహాన్ని చూస్తేనే జడుసుకుంటారు. అలాంటి ఉవ్వెత్తున ఎగసిపడుతూ దూసుకొస్తున్న నీటి ప్రవాహాన్ని చూస్తే ప్రాణభయంతో..

Shocking Video: తట్టుకునే దమ్ముంటేనే వీడియో చూడండి.. ప్రళయంలా దూసుకొస్తున్న ‘లావా’ ప్రవాహం..
Lava Floods

Updated on: Sep 20, 2022 | 2:05 PM

Shocking Video: కొందరు చిన్నపాటి నీటి ప్రవాహాన్ని చూస్తేనే జడుసుకుంటారు. అలాంటి ఉవ్వెత్తున ఎగసిపడుతూ దూసుకొస్తున్న నీటి ప్రవాహాన్ని చూస్తే ప్రాణభయంతో పక్కకు పోవడం ఖాయం. అయితే, ఇక్కడ నీటి ప్రవాహం కాదు.. నిప్పుల ప్రవాహం దూసుకెళ్తుంది. ఉప్పొంగిన నది ప్రవాహం ఎలా ఉంటుందో.. ప్రళయం సంభవిస్తే అలలు ఎలా ఎగసిపడుతూ ముందుకు దూసుకొస్తుందో.. అలా ‘లావా’ ప్రవాహిస్తోందక్కడ. లావా ప్రవాహానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసి నెటిజన్లు భయంతో షాక్ అవుతున్నారు.

అవును.. అగ్నపర్వతం బద్దలైన తరువాత అందులోంచి వెలువడిన లావా ఉవ్వెత్తున ఎగసిపడుతూ లోతట్టు ప్రాంతాలకు ప్రవహించింది. ఉప్పొంగి ప్రవహించే నది కన్నా భీకరంగా, అత్యంత వేగంగా, రాకసి అలలను మించిన ఎత్తులో ఎగసిపడుతూ దూసుకెళ్లింది. అత్యంత భయానకంగా ప్రవహిస్తున్న ‘లావా’ను కొందరు దూరం నుంచి తమ కెమెరాల్లో బందించారు. లావాకు కొంత దూరంలో ఇద్దరు రెస్క్యూటీమ్ సభ్యులు నిల్చుని ఉండటం కూడా చూడొచ్చు. అయితే, ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అదికాస్తా వైరల్ అయ్యింది. లావా ప్రవాహాన్ని చూసి నెటిజన్లు జడుసుకుంటున్నారు. ఇది నరకంలో నది ప్రవాహంలా ఉందంటూ కామెంట్స్ పెడుతున్నారు. అందులో పడితే.. కనీసం బుడిద కూడా మిగలదని ఇంకొందరు అంటున్నారు. మరెందుకు ఆలస్యం ఈ వీడియోపై మీరూ లుక్కేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..