70 ఏళ్ల వృద్ధుడు 20 ఏళ్ల సుందరితో ప్రేమలో పడ్డాడు..! పెళ్లిలో వీరి సందడి చూస్తే షాక్ అవ్వాల్సిందే..!!

|

Sep 27, 2024 | 10:30 AM

ఇదే కలియుగం అంటే అంటున్నారు చాలా మంది నెటిజన్లు. ఇదేదో ఈశాన్య రాష్ట్రానికి చెందినదిగా కనిపిస్తుందని మరొకరు రాశారు. ఎక్స్‌లో ఖాతాలో షేర్ చేసి ఈ వీడియోకి ఇప్పటివరకు వేల సంఖ్యలో వీక్షణలు వచ్చాయి. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

70 ఏళ్ల వృద్ధుడు 20 ఏళ్ల సుందరితో ప్రేమలో పడ్డాడు..! పెళ్లిలో వీరి సందడి చూస్తే షాక్ అవ్వాల్సిందే..!!
Teen age girl marries old man
Follow us on

ప్రేమ గుడ్డిది అంటారు.. అప్పుడు కొన్ని సంఘటనలు చూస్తే ఇది నిజమే అనిపిస్తుంది. ముఖ్యంగా యువతలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. చాలా మంది యువతీ యువకులు ప్రేమ పేరుతో తారతమ్యాలు మర్చిపోతుంటారు. దీంతో తల్లిదండ్రులు, బంధువుల నుంచి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి ఘటనలు అనేకం మనం వార్తల్లో చూస్తూనే ఉంటాం.. కానీ, యువత వృద్ధుల పట్ల ఆకర్షితులు కావడం చాలా అరుదుగా జరుగుతుంది. తాజాగా 70-75 ఏళ్ల వృద్ధుడు, 20-22 ఏళ్ల అమ్మాయి పెళ్లి చేసుకుంటున్న వీడియో వైరల్ అవుతోంది.

@Gulzar_sahabX ఖాతాలో షేర్‌ చేసిన వీడియోలో.. ఒక వృద్ధుడు 20 ఏళ్ల అమ్మాయి వివాహం చేసుకోవడం కనిపిస్తుంది. అది వివాహ వేడుక జరుగుతున్న ప్రదేశం.. అక్కడ కొంతమంది పిల్లలు, కుటుంబ సభ్యులు ఉన్నారు. అమ్మాయి పెళ్లి దుస్తుల్లో ఉండగా, వరుడి వేషంలో వృద్ధుడు తెల్లటి కుర్తా-పైజామా ధరించి ఉన్నాడు. ఆ వృద్ధ వరుడు మొదట అమ్మాయి మెడలో పూలమాల వేశాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి కూడా సంతోషంగా వృద్ధుడికి పూలమాల వేసింది. ఇద్దరూ ఒకరికొకరు పూ దండలు మార్చుకున్నారు. కుటుంబ సభ్యులు, పెద్దలు, పిల్లలు వారిపై పూల వర్షం కురిపిస్తున్నారు. ఇద్దరూ ఒకరి మొహాలు ఒకరు సంతోషంగా చూసుకుంటున్నారు. వారి మధ్య విచిత్రమైన ఆకర్షణ ఉంది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో చూడండి..

ఇదే కలియుగం అంటే అంటున్నారు చాలా మంది నెటిజన్లు. వీడియోలో చూసిన పిల్లలు, స్త్రీని బట్టి చూస్తే ఇదేదో రీల్ చేస్తున్నట్టుగా ఉందని మరికొందరు అంటున్నారు. ఇదేదో ఈశాన్య రాష్ట్రానికి చెందినదిగా కనిపిస్తుందని మరొకరు రాశారు. ఎక్స్‌లో ఖాతాలో షేర్ చేసి ఈ వీడియోకి ఇప్పటివరకు వేల సంఖ్యలో వీక్షణలు వచ్చాయి. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..