సోషల్ మీడియా (Social Media) లో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. వీటిలో ముఖ్యంగా ఫైటింగ్ కు సంబంధించినవి ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంటాయి. అబ్బాయిల మధ్య గొడవలు జరగడం సాధారణమే. కానీ మీరు ఎప్పుడైనా అమ్మాయిలు గొడవ పడటం చూశారా. అది కూడా జనాల మధ్య, తీవ్రంగా ఒకరినొకరు దెబ్బలాడుకుంటే. ఇలాంటి దృశ్యాన్ని మీరు చాలా అరుదుగా చూసి ఉంటారు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో అలాంటి వీడియో ఒకటి వైరల్ (Viral) అవుతోంది. వైరల్ అవుతున్న వీడియోలో ఇద్దరు అమ్మాయిలు ఒకరినొకరు తీవ్రంగా కొట్టకోవడాన్ని చూడవచ్చు. జుట్టు లాగుతూ, పంచ్‌లు విసురుకోవడం ద్వారా తమ కోపాన్ని ప్రదర్శిస్తున్నారు. కాగా.. చుట్టూ నిలబడి ఉన్న వ్యక్తులు వారిని విడిపించకుండా అలాగే చూస్తూ ఉండటం విస్మయం కలిగిస్తోంది. జుట్టు పట్టుకుని లాగుతూ మొదలైన ఈ పోరు ఆ తర్వాత కిక్కులు, పంచులుగా మారింది. ఇందులో ఒక అమ్మాయి మరొక అమ్మాయి గొంతు పట్టుకుని కింద పడేసి పైకి ఎక్కేస్తుంది. అంతటితో ఆగకుండా పంచుల వర్షం కురిపించడం చూడవచ్చు. కొంత సమయం తర్వాత చుట్టూ ఉన్న వాళ్లల్లో కొందరు వారిని విడిపిస్తారు. లేకుంటే వారి పరిస్థితి మరింత దయనీయంగా ఉండేది.
What’s wrong with Nibbies nowadays???♂️
They started fighting soon after leaving the coaching center.
Jarur Coaching me kuch panga hua hoga?#ViralVideo #KRKArrested #BoycottBrahmastra pic.twitter.com/NalOcuVyuw ఇవి కూడా చదవండి— देशी छोरा (@Deshi_Indian01) August 30, 2022
ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్న ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. ఈ వీడియో మధ్యప్రదేశ్ లోని ఓ కోచింగ్ సెంటర్ లో జరిగినట్లు తెలుస్తోంది. ఇద్దరు విద్యార్థినులు కోచింగ్ సెంటర్ నుంచి బయటకు రాగానే ఒకరినొకరు ఘర్షణ పడతారు. కారణం తెలియనప్పటికీ వారు వాదులాడుకునే విధానం చూస్తుంటే అది తీవ్రంగా ఉన్నట్లే అనిపిస్తోంది. కచ్చితంగా కోచింగ్‌లో ఏదో జరిగి ఉంటుందనే విషయం మనకు అర్థమవుతోంది. 45 సెకన్ల నిడివి కలిగిన ఈ వీడియోకు ఇప్పటి వరకు 5 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ సంఖ్య ఇంకా పెరుగుతోంది. అంతే కాకుండా వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. బాక్సింగ్ లో ఒలింపిక్స్ కు పంపిస్తే పతకం గ్యారెంటీ అని ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం చూడండి..