డబ్బు కోసం తెగ కష్టపడాల్సిన పనిలేదు.. ఈ పురుగు ఒక్కటి దొరికితే చాలు.. మీ జేబులో రూ.80 లక్షలు ఉన్నట్టే..!

స్టాగ్ బీటిల్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కీటకం, దీని ధర సుమారు రూ. 75 లక్షలు. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం వంటి హిమాలయ ప్రాంతాలలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. దీని అరుదు, ఔషధ గుణాలు, అదృష్టాన్ని తెస్తుందనే నమ్మకం దీని అధిక విలువకు కారణం. కుళ్ళిన కలపను ఆహారంగా తీసుకునే ఈ అరుదైన బీటిల్ గురించి మరింత తెలుసుకోండి.

డబ్బు కోసం తెగ కష్టపడాల్సిన పనిలేదు.. ఈ పురుగు ఒక్కటి దొరికితే చాలు.. మీ జేబులో రూ.80 లక్షలు ఉన్నట్టే..!
Stag Beetle

Updated on: Dec 20, 2025 | 3:41 PM

సాధారణంగా మన చుట్టూ ఉండే ప్రకృతిలో అనేక జంతుజీవాలు ఉన్నాయి. చెట్లు, మొక్కలు, పొదలు సర్వసాధారణం. అలాగే, ఎన్నో రకాల పక్షులు, పురుగులు, కీటకాలు అనేకం ఉంటాయి. అయితే, మనం కొన్ని రకాల కీటకాలను చూసినప్పుడు ఒళ్లు జలదరిస్తుంది. వెంటనే వాటిని వాటిని నివారించడానికి, వాటిని చంపడానికి మార్కెట్లో లభించే క్రిమినాశక మందులను ఉపయోగిస్తుంటాం. కానీ, ఈ రోజు మిమ్మల్ని ఆశ్చర్యపరిచే ఒక కీటకం గురించి మనం తెలుసుకోబోతున్నాం.. దీని కథ తెలిస్తే మీరు షాక్‌ అవుతారు. ఉన్న ఉద్యోగం, చేస్తున్న పనిని మానేసి ఆ పరుగుల వెంట పరుగులు తీస్తారు..ఇంతకీ అసలు విషయం ఏంటంటే…

వెచ్చని, తేలికపాటి వాతావరణం ఉన్న ప్రాంతాలలో స్టాగ్ బీటిల్స్ అనే కీటకాలు ఎక్కువగా కనిపిస్తాయి. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, పశ్చిమ కనుమల హిమాలయ ప్రాంతంలోని అడవులలో ఈ స్టాగ్ బీటిల్స్ ఎక్కువగా కనిపిస్తాయి. ఈ కీటకాలు ఎక్కువగా పాత చెట్లు, కలప కుప్పలలో ఉంటూ ఉంటాయి. కానీ, ఇవి సాధారణ కీటకాలు కావు.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కీటకం. మార్కెట్లో ఇది అత్యంత ధర పలుకుతుంది. ఈ కీటకం ఒకటి అమ్మితే 6 థార్‌ SUV లు కొనగలరట. అంటే, ఇది ఒక్కటి మీకు దొరికిందంటే.. దాదాపు రూ.80లక్షలు మీ జేబులో పడినట్టే అంటున్నారు.

మార్కెట్‌లో స్టాగ్ బీటిల్ ధర దాదాపు రూ. 75 లక్షల వరకు ఉంటుంది. అదే సమయంలో థార్ ఎక్స్-షోరూమ్ ధర దాదాపు రూ.11.50 లక్షలు, కాబట్టి మీరు ఒక స్టాగ్ బీటిల్ ధరకు సుమారు 6 థార్‌లను కొనుగోలు చేయవచ్చు. అయితే, ఈ కీటకం ఎందుకు అంత ఖరీదైనవి అని మీరు ఆలోచిస్తుండవచ్చు. ఎందుకంటే.. ఈ కీటకం అత్యంత అరుదైన కీటకం. ఇది అనేక మందులలో ఉపయోగించబడుతుంది. చాలా మంది దీనిని అదృష్టంగా కూడా భావిస్తారు. దీనిని ఇంట్లో ఉంచుకోవడం వల్ల రాత్రికి రాత్రే ధనవంతులు అవుతారని నమ్ముతారు.

ఇవి కూడా చదవండి

ఈ స్టాగ్ బీటిల్స్ కుళ్ళిపోతున్న కలపను తింటాయి. అక్కడే వాటి లార్వా ఆహారం తీసుకుంటాయి. వయోజన స్టాగ్ బీటిల్స్ పండ్ల రసాలు, నీరు, చెట్ల రసం మీద నివసిస్తాయి. అవి వాటి లార్వా అభివృద్ధి సమయంలో ఏర్పడిన కొవ్వు నిల్వలపై ఆధారపడతాయి. కానీ, ఈ స్టాగ్ బీటిల్స్ కొన్ని నెలలు మాత్రమే జీవిస్తాయి. వాటి జీవితకాలంలో సగానికి పైగా భూగర్భంలో గడుపుతాయి. అవి 3 నుండి 7 సంవత్సరాల వరకు ఎక్కడైనా గడపవచ్చు. అయితే, వాటి జీవితకాలం వాటి చుట్టూ ఉండే వాతావరణంపై ఆధారపడి ఉంటుంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..