‘మంచి కాఫీ లాంటి పజిల్’.. ఈ ఫోటో పజిల్ మీ ఐ ఫోకస్ రేంజ్ పెంచేస్తుంది. లేట్ ఎందుకు గయ్స్..! వచ్చేశాం మళ్లీ మాంచి కిర్రాక్ పజిల్‌తో మీ బుర్రను తికమక పెట్టేస్తుంది. మీమ్స్, కామెడీ వీడియోలు లాంటివి మీకు నచ్చినట్లయితే.. ఈ ఫోటో పజిల్స్‌ను కూడా ఓ పట్టుపట్టేస్తుంటారు. అటు ఫన్‌కి.. ఇటు చురుకుదనానికి.. ఫోటో పజిల్సే బెస్ట్ ఆప్షన్. అందుకేనేమో.. సోషల్ మీడియాలో ఈ ఫోటో పజిల్స్ తెగ ట్రెండ్ అవుతుంటాయి. మరి లేట్ ఎందుకు ఆ కోవలోనే వైరలవుతున్న ఓ పజిల్‌పై లుక్కేసేద్దాం.. పైన పేర్కొన్న ఫోటోను మీరు గమనించారా.? ఎక్కడ చూసినా.. ఏ లైన్ తిరగేసినా.. మీకు ‘8’ నెంబర్స్ కనిపిస్తున్నాయి కదూ.! కానీ అందులో మరో నెంబర్ కూడా దాగుంది. అదేమో ‘3’. ఇంతకీ అది ఏ వరుసలో ఉందో మీరు చిటికెలో గుర్తించాలి. పైపైన ఫోటో చూసేస్తే లాభం లేదమ్మా..! తీక్షణంగా ఓసారి పరిశీలించాలి. అప్పుడే మీకు ‘3’ నెంబర్ కనిపిస్తుంది. మరి లేట్ ఎందుకు ఓసారి ట్రై చేయండి. మీ కళ్లల్లో పదును ఎక్కవైతే.. ఫస్ట్ అటెంప్ట్‌లో గుర్తించండి. ఎంత వెతికినా మీకు ఆన్సర్ లభించకపోతే.. మీకోసం సమాధానం కింద ఇచ్చేశాం. చెక్ చేయండి మరి.!