Viral Video: పా..పా..పాము..పార్క్‌ చేసిన బైక్‌లోకి దూరి హల్‌చల్‌..! ఏం జరిగిందో చూస్తే ఒళ్ళు జలదరిస్తుంది..!

ఇటీవల కాలంలో వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల కావచ్చు లేదా అడవులు తగ్గిపోవడం వల్ల కావచ్చు.. పాములు జనావాసాల్లోకి విపరీతంగా వచ్చేస్తున్నాయి. ముఖ్యంగా మనం రోజువారీ వాడే బైకులు, కార్లు, చివరకు ఇంట్లో వేసుకునే షూస్‌లలో కూడా పాములు నక్కి ఉంటున్న ఘటనలు నిత్యం చూస్తూనే ఉన్నాం. తాజాగా, కర్నూలు జిల్లాలో ఇలాంటిదే ఒక ఒళ్ళు జలదరించే సంఘటన వెలుగుచూసింది. ఒకవేళ స్థానికులు గమనించకుండా ఉండి ఉంటే.. ఊహించని ప్రమాదం జరిగి ఉండేది.

Viral Video: పా..పా..పాము..పార్క్‌ చేసిన బైక్‌లోకి దూరి హల్‌చల్‌..! ఏం జరిగిందో చూస్తే ఒళ్ళు జలదరిస్తుంది..!
Snake In Scooter

Edited By:

Updated on: Jun 09, 2026 | 12:43 PM

కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్ మెయిన్ రోడ్డుపై ఈ విస్తుపోయే ఘటన జరిగింది. ఆదోనిలో నివసించే వినోద్ అనే బ్యాంకు ఉద్యోగి.. ఒకరోజు తన హోండా యాక్టివా బైక్‌పై బయటకు వచ్చాడు. మున్సిపల్ మెయిన్ రోడ్డు పక్కన బైక్‌ను పార్క్ చేసి, అవసరమైన విద్యుత్ పరికరాలను కొనుగోలు చేయడానికి సమీపంలోని ఒక ఎలక్ట్రికల్ షాపునకు వెళ్లాడు. అతను లోపలికి వెళ్లిన కొద్దిసేపటికే.. రోడ్డుపై వెళ్తున్న కొందరు స్థానికులు ఆ బైక్ దగ్గర ఒక వింతను గమనించారు. ఒక పాము నెమ్మదిగా బైక్ వెనుక టైర్ పైనుంచి లోపలి భాగానికి వెళ్లడం వారు చూశారు.

వినోద్ షాపింగ్ ముగించుకుని తిరిగి తన బైక్ దగ్గరకు రాగానే, అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా పాము.. పాము.. అంటూ గట్టిగా కేకలు వేశారు. బైక్ లోపలికి పాము దూరిన విషయాన్ని వినోద్‌కు వివరించారు. దాంతో భయపడిపోయిన వినోద్ బైక్‌ను ముట్టుకోకుండా దూరంగా జరిగాడు. స్థానికులు వెంటనే సమయస్ఫూర్తితో వ్యవహరించి, ఆదోనిలో ఉండే ఒక ప్రసిద్ధ స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించి అక్కడికి పిలిపించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న స్నేక్ క్యాచర్ బైక్‌ను నిశితంగా పరిశీలించాడు. పాము వెనుక టైర్ ల్యాంప్స్ గుండా నేరుగా బైక్ డిక్కీలోకి వెళ్లినట్లు గుర్తించాడు. సీటును జాగ్రత్తగా లాక్ ఓపెన్ చేయగా.. లోపల పాము నక్కి ఉండటం కనిపించింది. స్నేక్ క్యాచర్ ఎలాంటి ఇబ్బంది లేకుండా దాన్ని సులభంగా పట్టుకుని, గోనె సంచిలో బంధించాడు. ఆ తర్వాత ఆ పామును పట్టణ శివార్లలోని అటవీ ప్రాంతంలో సురక్షితంగా వదిలిపెట్టారు. పామును తీసేసినప్పటికీ, వినోద్ ఆ బైక్ ఎక్కడానికి కాసేపు తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. చుట్టుపక్కల వారు ధైర్యం చెప్పడంతో నెమ్మదిగా బైక్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

ఈ మధ్య కాలంలో బైకుల ఇంజన్లలో, కార్ల ఏసీ గ్రిల్స్‌లో, షూస్‌లలో పాములు చేరడం సర్వసాధారణమైంది. కాబట్టి వాహనాలను పార్కింగ్ చేసేటప్పుడు, తిరిగి స్టార్ట్ చేసేటప్పుడు ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని, షూస్ వేసుకునే ముందు వాటిని ఒకసారి రూర్చడం మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us