Viral: బస్సు ఇంజన్ నుంచి వింత శబ్దాలు.. డ్రైవర్ కంగారుగా వెళ్లి చూడగా…

ఆ బస్సు డ్రైవర్ ఊహించని అనుభవాన్ని ఫేస్ చేశాడు. అసలు ఇలా జరుగుతుందని కూడా ఊహించి ఉండడు. పాము ఇంజన్‌లో ఇరుక్కుపోయింది కాబట్టి తల మాత్రమే పైకి వచ్చింది. లేదంటే...?

Viral: బస్సు ఇంజన్ నుంచి వింత శబ్దాలు.. డ్రైవర్ కంగారుగా వెళ్లి చూడగా...
Snake In Bus

Updated on: Aug 24, 2022 | 6:13 PM

Trending: అదో మినీ టూరిస్ట్ బస్సు. జమ్మూ కాశ్మీర్‌(Jammu and Kashmir)లోని శ్రీనగర్‌(Srinagar)లోని ఖయామ్ చౌక్ ప్రాంతంలో దాన్ని నడుపుతూ వెళ్తున్నాడు డ్రైవర్. ఈ క్రమంలోనే అతను ఇంజన్ నుంచి వింత శబ్ధాలు రావడం గమనించాడు. కిందకు చూడగా.. ఓ పాము తల స్టీరింగ్ వీల్ పైకి పొడుచుకు వచ్చింది. దీంతో ఒక్కసారిగా కంగుతిన్న బస్సు డ్రైవర్.. వెంటనే బస్సు ఆపేసి కిందకు దిగాడు. ఆపై ఇంజన్ ఓపెన్ చేసి చూసి.. పాము అక్కడ ఇరుక్కపోయి ఉన్నట్లు గ్రహించాడు. దీంతో వెంటనే వైల్డ్‌లైఫ్ SOS ర్యాపిడ్ రెస్పాన్స్ యూనిట్‌కు సమాచారమిచ్చాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న రెస్య్కూ టీమ్.. అది లేత గోధుమరంగు పాచెస్ కలిగి ఉన్న రాయల్ స్నేక్ అని గుర్తించారు. రెండు గంటల పాటు కష్టపడిన టీమ్.. ఓ మెకానిక్ సాయంతో ఎట్టకేలకు ఆ పామును సురక్షితంగా బయటకు తీయగలిగారు. అదృష్టవశాత్తూ ఆ పాముకు ఎటువంటి గాయం కాలేదు. ప్రస్తుతం ఆ పామును వైల్డ్‌లైఫ్ NGO పర్యవేక్షణలో ఉంచారు. అది ఫిట్‌గా ఉందని తేలిన తర్వాత దాన్ని అడవిలో వదిలిపెట్టనున్నారు.  (Source)

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us