Viral: మట్టి తవ్వుతుండగా బయటపడ్డ వింత ఆకారం.. ఏంటని చూడగా కళ్లు బైర్లు..

గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిగినప్పుడు గానీ, పురావస్తు తవ్వకాలు జరుగుతున్నప్పుడు గానీ.. అప్పుడప్పుడూ విచిత్ర వస్తువులు బయటపడుతున్న సంఘటనలు మనం చూస్తూనే ఉంటాం. ఇలాంటివి తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా అలాంటి ఓ వింత సంఘటనకు..

Viral: మట్టి తవ్వుతుండగా బయటపడ్డ వింత ఆకారం.. ఏంటని చూడగా కళ్లు బైర్లు..
Viral Video

Updated on: Mar 08, 2024 | 3:44 PM

గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిగినప్పుడు గానీ, పురావస్తు తవ్వకాలు జరుగుతున్నప్పుడు గానీ.. అప్పుడప్పుడూ విచిత్ర వస్తువులు బయటపడుతున్న సంఘటనలు మనం చూస్తూనే ఉంటాం. ఇలాంటివి తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా అలాంటి ఓ వింత సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి మట్టిని తవ్వుతుండగా.. ఒక వింత ఆకారం బయటపడింది. అదేంటా అని చూడగా కళ్లు బైర్లు కమ్మాయి. ఇంతకీ అదేంటో ఇప్పుడు తెలుసుకుందామా..

వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. కొందరు మట్టి తవ్వుతుండగా.. వారికి ఏదో వింత ఆకారం కనిపించింది. దీంతో వారంతా కూడా కొంచెం కంగారుపడ్డారు. అదేంటోనని తెలుసుకునేందుకు దాని చుట్టూ ఉన్న మట్టిని జాగ్రత్తగా తీశారు. ఆ ఆకారం ఏవో జీవులవి అని తేలింది. చివరికి తీక్షణంగా దాన్ని పరిశీలించగా.. చాలా తాబేళ్లు ఓ రాయి మాదిరిగా ఒకదానిపై మరొకటి పేర్చినట్టు ఉన్నాయి. అందులోనూ అవి ప్రాణాలతో ఉండటం గమనార్హం. చెరువుల సమీపాన తాబేళ్లు ఇలా మట్టిలో నిద్రావస్థలో ఉంటాయని నిపుణులు అంటున్నారు. కాగా ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ‘ఇలాంటి దృశ్యం చూడటం ఇదే మొదటిసారి’ అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా.. ‘తాబేళ్లు అన్ని కూడా ఓ గోడ కట్టినట్టుగా ఉన్నాయని’ మరొకరు కామెంట్ పెట్టారు. డౌట్ ఉంటే.. వీడియోపై ఓ లుక్కేయండి..

ట్విట్టర్ వీడియో ఇదే..