Cow Babyshower: కూతురి కంటే ఘనంగా పుంగనూరు గోమాతకు సీమంతం.. ఊరంతా పేరంటం

|

Jun 08, 2022 | 6:43 PM

రైతులు గోమాత‌ను దైవంగా భావిస్తారు. పూజలు చేస్తారు. గోవులో స‌క‌ల దేవ‌త‌లు కొలువై ఉంటార‌ని పురాణాల క‌థ‌నం.. ఆవును పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు సంపూర్ణ ఆరోగ్యం, సుఖ సంప‌ద‌లు ల‌భిస్తాయ‌ని విశ్వాసం. సంతానం లేనివారికి..

Cow Babyshower: కూతురి కంటే ఘనంగా పుంగనూరు గోమాతకు సీమంతం.. ఊరంతా పేరంటం
Cow Babyshower
Follow us on

రైతులు గోమాత‌ను దైవంగా భావిస్తారు. పూజలు చేస్తారు. గోవులో స‌క‌ల దేవ‌త‌లు కొలువై ఉంటార‌ని పురాణాల క‌థ‌నం.. ఆవును పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు సంపూర్ణ ఆరోగ్యం, సుఖ సంప‌ద‌లు ల‌భిస్తాయ‌ని విశ్వాసం. సంతానం లేనివారికి సంతానం క‌లుగుతుంద‌ని చాలా మంది భక్తుల నమ్మకం. అందుకే చాలా మంది ఆవును భ‌క్తి శ్రద్ధల‌తో పూజిస్తారు. తమ ఇంట్లో సభ్యురాలిగా, కూతురుగా భావించి చాలా చోట్ల రైతులు గోవుకు సీమంతం చేసి వేడుకలు నిర్వహిస్తుంటారు. దూడ పుట్టాక కొందరు బారసాల కూడా జరిపిన ఘటనలు అనేకం చూశాం. ఇక తాజాగా పుంగనూరు సంతతికి చెందిన ఆవుకు విజయవాడలో ఘనంగా సీమంతం నిర్వహించారు.పెద్ద సంఖ్యలో భక్తులు, స్థానికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

విజయవాడలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత కల్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పుంగనూరు సంతతికి చెందిన ఆవుకు ఘనంగా సీమంతం నిర్వహించారు. పైగా ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. అంగరంగ వైభవంగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రోజున ఆలయం వద్ద గో పూజ నిర్వహించారు ఆలయ పండితులు. ఇందులో భాగంగానే పుంగునూరు సంతతికి చెందిన గోమాతకు వేడుకగా సీమంతం నిర్వహించారు ఆలయ సిబ్బంది. ఆవుకు నిర్వహించిన సీమంతం కార్యక్రమానికి 300లకు పైగా భక్తులు, స్థానికులు హాజరయ్యారు. ఇంటి ఆడ‌బిడ్డల‌కు నిర్వహించిన‌ట్టే గోవుకు సీమంతం వేడుక‌ను శాస్త్రోక్తంగా నిర్వహించారు. పుంగునూరు గోమాత‌కు మ‌త్తైదువుల సమ‌క్షంలో సీమంతం కార్యక్రమాన్ని ఘ‌నంగా చేశారు.