
సాధారణంగా ఇంటర్నెట్‌లో తరచూ రకరకాల వైరల్ వీడియోలు హల్చల్ చేస్తుంటాయి. అందులో కొన్ని మన కళ్లను మనం నమ్మేటట్టుగా ఉండవు. సరిగ్గా ఆ కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది. రెండు దేశాల మధ్య యుద్ధం చోటు చేసుకున్నప్పుడు.. ఆయా దేశాల ప్రజలను సురక్షితంగా ఉంచేందుకు బంకర్‌లను తయారు చేస్తాయి సదరు ప్రభుత్వాలు. అలాంటి బంకర్ ఇది. ఓ వ్యక్తి ఎప్పటిలానే కొండపైకి ట్రెక్కింగ్‌కు వచ్చాడు. చీకటి పడుతోందని కదా.. ఇక తిరిగి వెళ్లిపోదామని అనుకునేసరికి అతడికి ఓ పెద్ద అరుదైన రాయి లాంటిది కనబడింది.
బయట నుంచి చూసేందుకు పెద్ద రాయి మాదిరిగా అనిపిస్తున్నా.. దగ్గరకు వెళ్ళగా అది కొంచెం డిఫరెంట్‌గా ఉంది. ఇక వెళ్లి పరిశీలించగా.. అదొక బంకర్ అని తేలింది. రెండు ప్రపంచ యుద్ధంలో వాడిన బంకర్ అని తేల్చాడు. ఆ బంకర్ లోపాలన్నీ కూడా బలమైన తుప్పుపట్టిన ఇనుప గోడలు ఉన్నాయి. అలాగే ఓ పెద్ద లివర్‌ను తిప్పగా.. వింత శబ్దం వచ్చింది. బంకర్ లోపల దృశ్యాలు.. సినిమా రేంజులో ఉన్నాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ యూజర్ దీనిని ఇన్‌స్టాలో పోస్ట్ చేయగా.. క్షణాల్లో లక్షల్లో వ్యూస్ వచ్చిపడ్డాయి. అలాగే నెటిజన్లు దీనిపై వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు ఆ వీడియోపై మీరూ లుక్కేయండి.