Viral: పురాతన తవ్వకాల్లో బయటపడ్డ మొసలి ఆస్థిపంజరం.. కడుపు ఎక్స్‌రే తీసి చూడగా

పురాతన ఈజిప్ట్‌లో పురావస్తు శాఖ తవ్వకాల్లో ఓ మమ్మీఫైడ్ మొసలిని వెలికి తీశారు శాస్త్రవేత్తలు. 3 వేల ఏళ్ల నాటి ఆ మొసలి ఆస్థిపంజరం పొడవు సుమారు 7.2 అడుగుల ఉందని గుర్తించారు. దాని కడుపును ఎక్స్ రే తీయగా.. ఆ వివరాలు..

Viral: పురాతన తవ్వకాల్లో బయటపడ్డ మొసలి ఆస్థిపంజరం.. కడుపు ఎక్స్‌రే తీసి చూడగా
X Ray

Updated on: May 27, 2025 | 8:04 PM

సాధారణంగా మొసళ్లను దూరం నుంచి చూస్తేనే దడుసుకుంటాం. అలాంటిది మనం ఈడేటప్పుడు మొసలి పక్కనే ఉంటే.. ఇంకేమైనా ఉందా.! గుండె ఒక క్షణం ఆగిపోతుంది. అయితే మీరెప్పుడైనా 3 వేల ఏళ్ల నాటి పురాతన మమ్మీఫైడ్ మొసలిని చూశారా.? అదేంటో ఇప్పుడు తెలుసుకుందామా.. అరుదైన, ఆసక్తికర నాగరికతలకు పురాతన ఈజిప్ట్ పెట్టింది పేరు. స్థానికంగా ఉన్న కొన్ని ఆచారాలతో ఇక్కడ చనిపోయినవారి మృతదేహాలను మమ్మీఫికేషన్ ద్వారా సంరక్షిస్తారు. ఒక్క మనుషులను మాత్రమే కాదు.. జంతువుల మృతదేహాలకు కూడా వీరు పురాతన ఆచారాలనే పాటిస్తారు. అక్కడి దేవుళ్లకు నైవేద్యాలుగా మమ్మీలను ఉంచుతారు. ఇదిలా ఉంటే.. పురావస్తు తవ్వకాల్లో శాస్త్రవేత్తలకు సుమారు 3 వేల ఏళ్ల నాటి మమ్మీఫైడ్ మొసలి బయటపడింది.

సుమారు 7.2 అడుగుల పొడవున్న మమ్మీఫైడ్ మొసలిపై మాంచెస్టర్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు పలు పరిశోధనలు చేశారు. దీనిని స్పెసిమెన్ 2005.335 అని పిలుస్తారట. CT స్కానింగ్, ఎక్స్‌రే లాంటివి తీయగా.. మొసలి కడుపులో ఎముకలతో పాటు గ్యాస్ట్రోలిత్‌లు, రాళ్లు, కాంస్యపు చేపల హుక్‌ను గుర్తించారు. వాటితో పాటు ఎరగా ఉపయోగించే చేప అవశేషాలు కూడా మొసలి కడుపులో ఉన్నాయి. రాళ్లు ఇంకా కడుపులోకి వెళ్లలేదు కాబట్టి.. మొసలి మరణానికి కొద్దిసేపటి ముందు పట్టుబదిందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు.