Watch Video: అతనిలో ఏదో మానవాతీత శక్తి..! నెటిజన్లను షాక్ చేస్తున్న సఫారీ గైడ్.. ఏం చేశాడో మీరే చూడండి..

Watch Video: భూచర జీవుల్లో ఏనుగులు అపారమైన శక్తిని కలిగిన భారీ జంతువులు. కోపంతో ఉన్న ఏనుగుకు ఎదురుపడితే ఆడవికి రాజైనా వెనుదిరగాల్సిందే. అలాంటి ఏనుగుకు ఓ వ్యక్తి కేవలం తన చేతిని ‘ఆగు’ అన్నట్లుగా దానికి చూపించి..

Watch Video: అతనిలో ఏదో మానవాతీత శక్తి..! నెటిజన్లను షాక్ చేస్తున్న సఫారీ గైడ్.. ఏం చేశాడో మీరే చూడండి..
Viral Video Visuals

Updated on: Jul 04, 2023 | 6:45 PM

Watch Video: భూచర జీవుల్లో ఏనుగులు అపారమైన శక్తిని కలిగిన భారీ జంతువులు. కోపంతో ఉన్న ఏనుగుకు ఎదురుపడితే ఆడవికి రాజైనా వెనుదిరగాల్సిందే. అలాంటి ఏనుగుకు ఓ వ్యక్తి కేవలం తన చేతిని ‘ఆగు’ అన్నట్లుగా దానికి చూపించి కంట్రోల్ చేశాడు. అంతే అది ఏదో పెంపుడు జంతువులా వెనక్కు ఆడుగులు వేసింది. సదరు వ్యక్తి ఏనుగుకు కంట్రోల్ చేయడానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతోంది. ఆ వీడియోను కనుక మీరు చూసినట్లయితే.. అందులో పర్యాటకులను భయపట్టేందుకు ఓ ఏనుగు వారి ముందుకు గంభీరంగా వస్తుంది. అయితే వారితో పాటు ఉన్న ఓ ఫారెస్ట్ గైడ్ దాని వైపు చేయి చూపించాడు. అంతే అది అక్కడే ఆగి వెనక్కు ఆడుగులు వేస్తూ వెళ్లింది.

అయితే వైరల్ అవుతున్న ఈ వీడియోలోని సన్నివేశాన్ని నమ్మలేకపోతున్నామని నెటిజన్లు చెప్పుకొస్తున్నారు. ఇంకా ఆ సఫారీ గైడ్‌లో ఏవో మానవాతీత శక్తులు ఉన్నాయేమోనంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఆ గైడ్‌లోని ధైర్యం, దానిపై అతని విశ్వాసం మనిషి అంచనాలకు అందనిదని పలువురు రాసుకొచ్చారు. ఇలా నెటిజన్లను ఆకర్షిస్తున్న ఆ వైరల్ వీడియో జూన్ 29న ట్విట్టర్ వేదికగా షేర్ అయింది. అప్పటినుంచి ఈ వీడియోకు ఇప్పటివరకు దాదాపు 15 లక్షలకు పైగా వీక్షణలు, 22 వేలకు మించి లైకులు లభించాయి.

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న వీడియో..

మరిన్ని ట్రెండింగ్  వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us