రష్యన్ మహిళతో బీహార్ యువకుడి పెళ్లి? సోషల్ మీడియా వైరల్ వార్త వెనుక అసలు నిజాలివే!

రష్యాకు చెందిన జూలీ అనే మహిళ బీహార్‌కు చెందిన యువకుడిని పెళ్లి చేసుకోవడానికి భారత్‌కు వచ్చిందంటూ ఇటీవల సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరల్ అయ్యింది. అయితే ఫ్యాక్ట్ చెక్‌లో ఈ ప్రచారం పూర్తిగా ఫేక్‌ అని తేలింది. ఇంగ్లాండ్‌కు చెందిన శివియా ఛారిటీ అనే స్వచ్ఛంద సంస్థ బృందం యూపీ, బీహార్, జార్ఖండ్ ప్రాంతాల పర్యటనకు వచ్చింది. ఆ సమయంలో ఒక స్థానిక యువకుడు విదేశీ ప్రతినిధితో కలిసి వీడియో తీసి ఇంటర్నెట్‌లో పోస్ట్ చేశాడు. ఆ తరువాత ఏం జరిగిందంటే..

రష్యన్ మహిళతో బీహార్ యువకుడి పెళ్లి? సోషల్ మీడియా వైరల్ వార్త వెనుక అసలు నిజాలివే!
Ussian Woman Viral News

Updated on: Oct 14, 2026 | 6:42 PM

సోషల్ మీడియా యుగంలో ఏ వార్త ఎప్పుడు వైరల్ అవుతుందో ఊహించడం కష్టం. ముఖ్యంగా విదేశీయులు, భారతీయుల మధ్య ప్రేమాయణాలు, పెళ్లిళ్ల గురించిన వార్తలకు ఇంటర్నెట్‌లో విపరీతమైన ఆదరణ ఉంటుంది. ఇటీవల బీహార్‌కు చెందిన రాహుల్ యాదవ్ (ఇన్‌స్టాగ్రామ్ ఐడీ: నమిత్ భయ్) అనే యువకుడిని పెళ్లి చేసుకోవడానికి రష్యా నుంచి జూలీ అనే మహిళ భారత్‌కు వచ్చిందని, నవంబర్‌లో వీరిద్దరి వివాహం జరగనుందని వార్తలు విపరీతంగా హల్‌చల్ చేశాయి. అయితే, ఈ వైరల్ వార్తపై క్షేత్రస్థాయిలో పరిశోధన తరువాత అసలు నిజాన్ని బయటపడ్డాయి.

వైరల్ దావా ఏమిటి?

సామాజిక మాధ్యమాల్లో ప్రచారమైన కథనాల ప్రకారం.. బీహార్‌లోని భాగల్‌పూర్‌కు చెందిన యువకుడు రష్యా వెళ్లినప్పుడు అక్కడ ఒక మహిళతో పరిచయం ఏర్పడిందని, ఆ పరిచయం ప్రేమగా మారి ఆమె అతడిని వెతుక్కుంటూ గ్రామానికి వచ్చిందని ప్రచారం చేశారు. ఆ విదేశీ మహిళ స్థానిక గ్రామంలో తిరుగుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి.

ఇవి కూడా చదవండి

ఈ ప్రచారం కేవలం ఒక సృష్టి అని, పూర్తి అబద్ధమని తేలింది. అసలు విషయం ఏమిటంటే.. ఇంగ్లాండ్‌కు చెందిన శివియా ఛారిటీ అనే స్వచ్ఛంద సంస్థ ప్రతినిధుల బృందం గ్రామీణ ప్రాంతాల పర్యటనలో భాగంగా ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్‌లకు వచ్చింది. ఈ పర్యటనలో భాగంగా ఆ NGO టీమ్‌తో ఉన్న విదేశీ మహిళ పూర్ణియా ప్రాంత సందర్శనకు వచ్చినప్పుడు సదరు యువకుడు ఆమెతో కలిసి ఒక వీడియో తీశాడు.

యువకుడి స్పష్టత, పోలీసుల రంగ ప్రవేశం

ఈ విషయంపై వివాదం ముదరడం, తప్పుడు ప్రచారం జరగడంతో ఆ యువకుడు ఒక కొత్త వీడియోను విడుదల చేస్తూ స్పష్టత ఇచ్చాడు. నాకు ఆ విదేశీ మహిళతో ఎలాంటి సంబంధం లేదు. ఆ వ్యాక్యం పూర్తిగా అబద్ధం. ఆ మహిళ కేవలం మా గ్రామాన్ని సందర్శించడానికి వచ్చిన ఒక అతిథి. ఆమెతో తీసిన వీడియోను నేను సరదాగా షేర్ చేస్తే, కొందరు తప్పుగా ప్రచారం చేశారు అని అతడు వెల్లడించాడు.

ఈ ప్రచారం వెనుక ఉన్న అసలు వివరాలను సేకరించేందుకు స్థానిక పోలీసులు కూడా రంగంలోకి దిగారు. ఏది ఏమైనా, సోషల్ మీడియాలో కనిపించే ప్రతీ సంచలన వార్త నిజం కాదని, నిజానిజాలు తెలుసుకోకుండా వార్తలను నమ్మకూడదని ఈ ఘటన మరోసారి నిరూపించింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us