Viral Video: వామ్మో.. ఇంట్లో అకస్మాత్తుగా ప్రత్యేక్షమైన భారీ శ్వేతనాగు.. గూస్ బంప్స్ తెప్పించే వీడియో..

మనం ఇప్పటి వరకూ ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన ప్రమాదకరమైన కింగ్‌ కోబ్రాను చూశాం. ఇటీవల ఎక్కడంటే అక్కడ ఇవి కనిపిస్తూ జనాలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.

Viral Video: వామ్మో.. ఇంట్లో అకస్మాత్తుగా ప్రత్యేక్షమైన భారీ శ్వేతనాగు.. గూస్ బంప్స్ తెప్పించే వీడియో..
White Cobra

Updated on: May 06, 2023 | 1:07 PM

మనం ఇప్పటి వరకూ ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన ప్రమాదకరమైన కింగ్‌ కోబ్రాను చూశాం. ఇటీవల ఎక్కడంటే అక్కడ ఇవి కనిపిస్తూ జనాలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. అయితే స్నేక్‌ క్యాచర్స్‌ వాటిని తమ నైపుణ్యంతో పట్టి బంధించి సురక్షిత ప్రాంతాల్లో వదులుతున్నారు. అయితే ఈ కింగ్ కోబ్రా చాలా పొడవుగా ఉండటమే కాకుండా నల్లగా దాని ఒంటిపై తెల్లటి చారను కలిగి ఉంటుంది. ఇది అందరికీ తెలిసిందే. కానీ తమిళనాడులో ఓ భారీ శ్వేతనాగు ప్రత్యక్షమై అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.

తమిళనాడులోని కోయంబత్తూరు పరిసర ప్రాంతాల్లో 10 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా రెండ్రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ వరద నీటిలో ఓ అరుదైన భారీ శ్వేత నాగు కొట్టుకొచ్చింది. కురింజి శక్తినగర్‌కు చెందిన ఆనంద్‌ అనే వ్యక్తి ఇంటి ప్రాంగణంలోకి చొరబడింది. దానిని చూసి భయాందోళనకు గురైన స్థానికులు అటవీ సిబ్బందికి సమాచారమిచ్చారు. రంగంలోకి దిగిన అటవీ సిబ్బంది శ్వేతనాగును బంధించి సమీపంలోని అడవుల్లో వదిలిపెట్టారు.

శ్వేతనాగు వీడియో చూడండి..

జన్యుపరమైన సమస్య కారణంగా అల్బినో కోబ్రా తెల్లగా ఉంటుందని వన్యప్రాణి సంరక్షకులు తెలిపారు. ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సుశాంత్ నందా ట్విట్టర్‌లో పంచుకున్నారు. దాంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. అరుదైన నాగుపామును చూసి జనం ఆశ్చర్యపోతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..

Loading...
Unable to load recommendations.
Follow Us