బాబోయ్..ఇలాంటి ఏలియన్‌ పిల్లిని ఎప్పుడైన చూశారా..? సోషల్ మీడియాను షేక్‌చేస్తున్న డాబీ!

మన చుట్టూ ఉన్న ప్రకృతిలో ఒక్కోసారి ఊహించని వింతలు, విశేషాలు జరుగుతుంటాయి. ముఖ్యంగా జంతు ప్రపంచంలో అప్పుడప్పుడు విచిత్రమైన శారీరక మార్పులతో జన్మించే జీవులు అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. తాజాగా సోషల్ మీడియాలో అటువంటి ఒక వింత పిల్లి పిల్లకు సంబంధించిన వార్త తెగ హల్‌చల్ చేస్తోంది. సాధారణంగా పిల్లులకు రెండు చెవులు ఉంటాయి. కానీ, ఈ పిల్లి పిల్లకు మాత్రం ఏకంగా నాలుగు చెవులు ఉన్నాయి.

బాబోయ్..ఇలాంటి ఏలియన్‌ పిల్లిని ఎప్పుడైన చూశారా..? సోషల్ మీడియాను షేక్‌చేస్తున్న డాబీ!
Four Eared Kitten

Updated on: Jun 29, 2026 | 1:30 PM

సోషల్ మీడియాలో డాబీ అనే ఒక వింత పిల్లి పిల్ల వీడియోలు, ఫోటోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. సాధారణ పిల్లులకు భిన్నంగా ఈ పిల్లి పిల్లకు ఏకంగా నాలుగు చెవులు ఉన్నాయి. ఈ అరుదైన శారీరక ఆకృతిని చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. దీనికి చిత్ర విచిత్రమైన పేర్లు పెడుతున్నారు. లైకులు, షేర్లు చేస్తూ ఈ పిల్లి పిల్లను తెగ ఫేమస్‌ చేస్తున్నారు. అయితే, ఈ పిల్లి పిల్ల పుట్టుకతోనే ఒక అరుదైన శారీరక మార్పుతో జన్మించింది. దీని తలపై సాధారణంగా ఉండే రెండు పెద్ద చెవులతో పాటు, వాటి కింద మరో రెండు చిన్న చెవులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. హ్యారీ పోటర్ సిరీస్‌లోని ప్రసిద్ధ పాత్ర డాబీని పోలి ఉండటంతో దీనికి ఆ పేరే పెట్టారు. ఈ పిల్లి పిల్ల వింత రూపాన్ని చూసిన చాలా మంది నెటిజన్లు దీనిని ఏలియన్ క్యాట్ బేబీ (Alien Cat Baby) లేదా గ్రహాంతర వాసి అంటూ కామెంట్లు పెడుతున్నారు.

నాలుగు చెవులు ఉండటానికి కారణం ఏంటి?:

జంతు శాస్త్రవేత్తలు, పశువైద్యుల (Veterinarians) ప్రకారం, ఇలా జరగడం వెనుక ఎటువంటి గ్రహాంతర శక్తులు లేవు. ఇది పూర్తిగా ఒక అరుదైన జన్యు లోపం. సైన్స్ భాషలో దీనిని జెనెటిక్ మ్యుటేషన్ (Genetic Mutation) అంటారు. తల్లిదండ్రుల నుండి వచ్చే జీన్స్‌లో లోపాలు ఉన్నప్పుడు లేదా గర్భస్థ దశలో కణాల విభజన సరిగ్గా జరగనప్పుడు ఇలాంటి వింత ఆకృతులు ఏర్పడతాయి. అయితే, అదనంగా ఉన్న ఈ రెండు చెవుల వల్ల పిల్లికి వినికిడి శక్తి ఎక్కువగా ఉంటుందని చెప్పలేము, అవి కేవలం శారీరక ఎదుగుదలలో భాగం మాత్రమే.

ఇవి కూడా చదవండి

నెటిజన్ల స్పందన:

డాబీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో దీని వీడియోలకు మిలియన్ల కొద్దీ వ్యూస్, లైకులు వస్తున్నాయి. మొదట్లో దీనిని చూసి కొందరు నెటిజన్లు ఒకింత భయపడినప్పటికీ, ఇప్పుడు ఈ పిల్లి పిల్లకు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇది చాలా క్యూట్‌గా, అరుదుగా ఉందంటూ జంతు ప్రేమికులు దీని యజమానిని అభినందిస్తున్నారు. జన్యుపరమైన లోపాలు ఉన్నప్పటికీ, సాధారణ పిల్లుల లాగే డాబీ కూడా ఎంతో చురుగ్గా, ఆరోగ్యంగా ఆడుకుంటూ అందరి మనసులను గెలుచుకుంటోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us