PUBG Love: అడ్డొస్తే 55 ముక్కలుగా నరికి డ్రమ్‌లో వేస్తా.. పబ్జీ ప్రియుడి కోసం భర్తకు భార్య స్ట్రాంగ్‌ వార్నింగ్!

ఆన్‌లైన్‌ గేమ్‌ పబ్‌జీలో పరిచయమైన వ్యక్తి కోసం.. ఓ పాకిస్థానీ మహిళ తన నలుగురు పిల్లలతో కలిసి భారత్‌ వచ్చిన విషయం గుర్తుంది కదా..తాజాగా ఇలాంటి ఓ ఘటనే ఉత్తర ప్రదేశ్‌లో వెలుగు చూసింది. పబ్జీలో ఏర్పడిన ప్రేమ కోసం ఓ వివాహిత కట్టుకున్న భర్తనే చంపుతానని బెదిరించగా.. ఈమె కోసం వెయ్యి కిలోమీటర్లు ప్రయాణించి వచ్చిన ప్రియుడు చివరికి పోలీస్‌ స్టేషన్‌ పాలయ్యాడు.

PUBG Love: అడ్డొస్తే 55 ముక్కలుగా నరికి డ్రమ్‌లో వేస్తా.. పబ్జీ ప్రియుడి కోసం భర్తకు భార్య స్ట్రాంగ్‌ వార్నింగ్!
Pubg Love

Updated on: Jun 27, 2025 | 8:30 PM

కొవిడ్‌ టైంలో వచ్చిన ప్లేయర్‌ అన్నౌన్‌ బ్యాటిల్‌ గ్రౌండ్‌ అనే పబ్జీ గేమ్‌.. యువతను సగం నాశనం చేసింది. ఈ గేమ్‌ కారణంగా ఎంతో మంది మానసిక స్థితిని కోల్పోగా కొందరు ఏకంగా ప్రాణాలే తీశారు. మరికొందరైలే ఈ గేమ్‌లో పరచయమైన వారి కోసైం ఏకండా దేశాలనే దాటి వచ్చారు. తాజాగా ఇలాంటి ఓ ఘటనే ఉత్తర ప్రదేశ్‌లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే, ఉత్తరప్రదేశ్‌లోని బాందా జిల్లాకు చెందిన ఆరాధన అనే యువతికి శీలు అనే వ్యక్తితో 2022లో వివాహం జరిగింది. అయితే వీరికి ప్రస్తుతం ఏడాదిన్నర కొడుకు కూడా ఉన్నాడు. అయితే, శీలు బయట ఏదో ప్రైవట్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తుండగా..భార్య ఆరాధన ఇంట్లోనే ఉండేది. ఈ క్రమంలోనే ఆమె పబ్జీ గేమ్‌ ఆడడం స్టార్ట్‌ చేసింది. ఈ క్రమంలోనే అమెకు లూధియానాకు చెందిన శివమ్ అనే యువకుడితో గేమ్‌లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా కొన్నాళ్ల తర్వాత ప్రేమగా మారింది.

ఇలా వీరు గేమ్‌ ఆడుతున్న సందర్భంలో ఒకరి గురించి ఒకరు చెప్పుకునేవారు. ఈ క్రమంలో భర్త రోజు తాగి వచ్చి తనను చిత్రహింసలకు గురిచేస్తున్నట్టు ఆరాధన పదేపదే శివమ్‌కు చెప్తూ ఉండేది. దీంతో ప్రియురాలు బాధపడుతున్నట్టు గ్రహించిన శివమ్, ఆమెను నేరుగా కలుసుకునేందుకు లూధియానా నుంచి దాదాపు వెయ్యి కిలోమీటర్లు ప్రయాణించి ఆరాధన ఇంటికి వచ్చాడు. ఇంట్లో శివమ్‌ను చూసి ఆరాధన కుటుంబ సభ్యులు ఎవరీ వ్యక్తి అని ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. తీరా విషయం తెలసుకొని అతనితో గొడవకు దిగారు.

ఈ క్రమంలోనే శివమ్‌,ఆరాధన ఒక వైపు కాగా.. ఆమె భర్త, వాళ్ల కుటుంబ సభ్యులు ఒక వైపు అయ్యారు. ఇరు వర్గాలు గొడవకు దిగారు. దీంతో పరిస్థికి ఉద్రిక్తతంగా మారింది. దీంతో ఎలాగైన తన ప్రియుడితో వెళ్లిపోవాలనుకున్న ఆరాధన భర్తకు స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చింది. మాకు అడ్డొస్తే చంపి ముక్కలు ముక్కలుగా నరికి డ్రమ్‌లో వేస్తానని హెచ్చరించినట్టు పోలీసుల తెలిపారు. భార్య వార్నింగ్‌తో వణికిపోయిన భర్త వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఆరాధన భర్త ఫిర్యాదులో ఆమె ప్రియుడు శివమ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని కోర్టులో హాజరుపర్చారు. ఈ క్రమంలో ప్రియుడి కోసం పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఆరాధన.. తన భర్త రోజు తాగి వచ్చి తనను వేధిస్తున్నాడని ఆరోపిస్తూ, తనకు భర్తతో ఉండాలని లేదని.. తాను శివమ్‌తోనే ఇకపై జీవనం సాగించాలనుకుంటున్నట్టు స్పష్టం చేసింది. ఈ విషయం విన్న పోలీసులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..