Viral Video: సముద్రం మీదుగా వెళ్తోన్న విమానం.. ఆకాశంలో కనిపించిన అద్భుత దృశ్యం.. మిస్టరీ ఏంటంటే!

ఈ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఏ వింత సంఘటన చోటు చేసుకున్నా.. అది ఏలియన్స్ పనేనంటూ..

Viral Video: సముద్రం మీదుగా వెళ్తోన్న విమానం.. ఆకాశంలో కనిపించిన అద్భుత దృశ్యం.. మిస్టరీ ఏంటంటే!
Mysterious Red Glow

Updated on: Jul 28, 2022 | 12:45 PM

ఈ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఏ వింత సంఘటన చోటు చేసుకున్నా.. అది ఏలియన్స్ పనేనంటూ చర్చ జరుగుతోంది. అసలు ఇంతకీ ఏలియన్స్ ఉన్నాయో లేదో తెలియదు గానీ..! తాజాగా చోటు చేసుకున్న ఓ ఘటన మరోసారి ఈ చర్చకు దారి తీస్తోంది. ప్రస్తుతం నెట్టింట అందుకు సంబంధించిన వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. అసలు అదేంటో చూసేద్దాం..

వైరల్ వీడియో ప్రకారం.. అట్లాంటిక్ సముద్రం మీదుగా విమానం వెళ్తుండగా.. పైలట్‌కు మేఘాలపై ఎర్రటి కాంతి మచ్చలు కనిపించాయి. ఆ దృశ్యాన్ని తన కెమెరాలో బంధించాడు. ఇలాంటిది తానెప్పుడూ చూడలేదని పేర్కొంటూ ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశాడు. దెబ్బకు అది కాస్తా క్షణాల్లో వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ఏలియన్స్ పనేనంటూ కొందరు అంటుంటే.. సాంప్రదాయక ఫిషింగ్ కోసం జాలర్లు వేసే ఎర్రటి కాంతి లైట్లు కావొచ్చునని మరికొందరు రాసుకొచ్చారు. మరి దీనిపై మీ అభిప్రాయమేంటి.?

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..

Loading...
Unable to load recommendations.
Follow Us