Puzzle: ఆగమాగమవుతారు.. ఈ ఫోటోలోని పిల్లిని 30 సెకన్లలో కనిపెడితే మీరు గ్రేట్ అంతే

Find Cat in the Picture: ఫోటో పజిల్స్‌ను ఈ మధ్య చాలామంది ఇష్టపడుతున్నారు. ఫోటో పజిల్స్ మన మెదడును చురుగ్గా చేయడమే కాదు.. మన ఐ పవర్ ఏ స్థాయిలో ఉందో కూడా చెప్పేస్తాయి. తాజాగా మీ కోసం ఓ క్రేజీ ఫజిల్...

Puzzle: ఆగమాగమవుతారు.. ఈ ఫోటోలోని పిల్లిని 30 సెకన్లలో కనిపెడితే మీరు గ్రేట్ అంతే
Find Cat In The Picture

Updated on: Jun 25, 2022 | 8:24 PM

Picture Puzzle: కాస్తంతా ఫ్రీ టైమ్ దొరికితే చాలామంది వెంటనే సోషల్ మీడియా(Social Media)లోకి వెళ్లిపోతారు. అక్కడ బోలెడంత కంటెంట్ ఉంటుంది. స్క్రోల్ చేస్తూనే ఉండిపోతారు.  మెదడుకు మేత పెట్టే అనేక పజిల్స్, ఆప్టిక‌ల్ ఇల్యూజ‌న్స్(optical illusions), బ్రెయిన్ టీజర్స్ సైతం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పజిల్స్ ద్వారా మీ బుర్ర ఎంత యాక్టివ్‌గా పని చేస్తుందో తెలుసుకోవచ్చు. ఫోటో పజిల్స్ ద్వారా మీ చూపుల్లో పదును ఏ లెవల్‌లో ఉందో టెస్ట్ చేసుకోవచ్చు. ఇక బ్రెయిన్ టీజర్స్ ద్వారా మీరు ఎంత తెలివిగా థింక్ చేస్తున్నారో ఇట్టే తెలిసిపోతుంది.  పజిల్స్‌లో ఫోటో పజిల్స్ కూడా ఓ పార్ట్.  ఎప్పుడూ ఆత్మ విశ్వాసంతో ఉండేవారు.. ఎలాంటి టాస్క్ అయినా సాల్వ్ చేసేందుకు రెడీగా ఉంటారు. అందుకే ఎలాంటి పజిల్ కనబడినా.. దాని లెక్క తేల్చేవరకు అస్సలు వదలరు. ఇలాంటి పజిల్స్ కొన్ని సులభంగా ఉన్నా, మరికొన్ని మాత్రం చాలా టఫ్‌గా అనిపిస్తాయి. తెగ తికమక పెడుతూ మనకి ఛాలెంజ్ విసురుతాయి. బుర్రని వేడెక్కిస్తాయి.  వీడని చిక్కుముడిలా ఉండి మనల్ని చీట్ చేస్తాయి. తాజాగా ఓ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. అది ఓ పార్క్‌లో తీసిన ఫోటో.  అందులో ఓ పిల్లి ఉంది. అది ఎక్క‌డ ఉందో చెప్పాలి. ఏదో పైపైన ఆ ఫోటోను చూస్తే ఆ పిల్లిని క‌నిపెట్ట‌లేరు. ఫోకస్ పెట్టి చూడాల్సిందే.  మా వల్ల కాదు బాబోయ్ అనిపిస్తే.. దిగువన ఆన్సర్ ఇస్తున్నాం చూసెయ్యండి.

చూశారుగా… ఇప్పుడు అనిపిస్తుంది కదా.. అరెరె.. అక్కడే ఉన్నా కనిపెట్టలేకపోయాం అని.అందుకే కాస్త ఓపికతో చూడమన్నది. మీరే కాదు.. నూటికి 80 శాతం మంది ఈ ఫోటోలోని పిల్లిన కనిపెట్టడంలో ఫెయిల్ అయ్యారు. ఈ సారి ఫోటో పజిల్ ఇచ్చినప్పుడు మాత్రం కాస్త  తీక్షణతో చూడండి. మీరు పక్కా విన్ అవుతారు.

 

మరిన్ని వైరల్‌ పజిల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us