
నీళ్లలో ఉన్నంతసేపు మొసలికి ఎంతో పవర్ ఉంటుంది. ఆ సమయంలో బలమైన ఏనుగును సైతం నీటిలోకి లాగి చంపేస్తుంది. అయితే అన్నిసార్లు పరిస్థితి ఇలాగే ఉంటుందా.. అంటే ఉండదు అనే చెప్పాలి. కొన్నిసార్లు ఇందుకు పూర్తి విరుద్ధంగా కూడా జరుగుతుంటుంది. ఇందుకు నిదర్శనంగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది.
మొసలి పేరు వింటేనే చెమటలు పట్టేస్తాయి.. అత్యంత ధైర్యవంతులైన జీవుల్లో ఒకటి. అలాంటిది నది ఒడ్డున సేదతీరుతున్న మొసలి తోక పట్టి నీటిలోంచి బయటకు లాగేందుకు ప్రయత్నించింది ఓ అల్లరిమూక. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఏ మూగ జంతువునూ వేధించకూడదంటూ జంతు ప్రేమికులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఉత్తరప్రదేశ్‌లోని కాస్‌గంజ్ పోలీసులు రంగంలోకి దిగి చర్యలు చేపట్టారు.
కాస్గంజ్ లోని నాదరాయ్ వంతెన కింద నీటిలో ఒక మొసలి హాయిగా కూర్చుంది. నీరు చాలా స్పష్టంగా ఉంది. అది నీటి అడుగున కూర్చున్నట్లు స్పష్టంగా కనిపించింది. ఇది ఎవరికీ హాని కలిగించదు. దాడి చేసే రీతిలో కూడా లేదు. అయినప్పటికీ, అసాధారణ స్వభావాలు కలిగిన ఇద్దరు వ్యక్తులు నది ఒడ్డుకు చేరుకున్నారు. వారిలో ఒకరు మొసలి తోకను పట్టుకోవడానికి ప్రయత్నించాడు. అంతేకాదు మొసలి తోక పట్టుకుని నీటిలో నుంచి బయటకు లాగేందుకు యత్నించాడు.
అకస్మాత్తుగా మేల్కొన్న మొసలి, దాడి చేసేందుకు బదులుగా, దాని తోకను విడిపించకుని పారిపోయింది. ఈ 42 సెకన్ల ఫుటేజీలో, వంతెనపై నిలబడి సంఘటనను చిత్రీకరిస్తున్న వ్యక్తి దుర్భాషలాడుతూ మరింత రెచ్చగొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో పోలీసులు ఇప్పుడు ఈ విషయంలో చర్య తీసుకోవడానికి సిద్ధమయ్యారు.
ఈ వీడియోను మొదట @vansh_91 అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో “నద్రాయిలో ప్రత్యక్ష మొసలి దొరికింది” అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేశారు. ఆ యూజర్ కామెంట్స్ సెక్షన్‌ను డిసేబుల్ చేశారు. అయితే, ఈ వీడియోకు ఇప్పటికే 2.5 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. 84,000 మందికి పైగా యూజర్లు లైక్ చేశారు. అబ్బాయిల చర్యలను గమనించిన వినియోగదారులు, తీవ్రంగా స్పందించారు. మూగ జీవాలతో రాక్షస క్రీడలు మంచిది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ వీడియోలో వ్రాసిన సమాచారం ప్రకారం, ఈ సంఘటన జనవరి 18న మధ్యాహ్నం 2:15 గంటల ప్రాంతంలో జరిగింది. ఉత్తరప్రదేశ్ లోని కాస్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగినట్లు గుర్తించారు. సోషల్ మీడియా X పై ట్యాగ్ చేసిన పోస్ట్‌కు ప్రతిస్పందిస్తూ @kasganjpolice, “సంబంధిత వ్యక్తులను అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు” అని రాశారు.
వీడియో ఇక్కడ చూడండి.. :
Being stupid is different from being brave
A man gets into water and trying to pull a crocodile by its tail.
Lucky for the guy seems crock was not hungry.use headphones please. pic.twitter.com/VQfzeJ5EIw
— Woke Eminent (@WokePandemic) January 19, 2026
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..