Photo Puzzle: ఈ పజిల్‌తో కథ వేరుంటది.. మీతో రివర్స్ గేమ్ ఆడుతది.. పామును పసిగట్టగలరా..?

|

Jul 23, 2022 | 12:40 PM

వీకెండ్ బుక్స్, మ్యాగజైన్స్‌లో వచ్చే వివిధ రకాల పజిల్స్‌‌ను సాల్వ్ చేసేందుకు చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. వాటిలో ఫోటో పజిల్స్ కూడా ఓ పార్ట్. మీ కోసం ఇప్పుడు క్రేజీ ఫోటో పజిల్...

Photo Puzzle: ఈ పజిల్‌తో కథ వేరుంటది.. మీతో రివర్స్ గేమ్ ఆడుతది.. పామును పసిగట్టగలరా..?
Find The Snake
Follow us on

Viral Photo: పజిల్స్ చాలా కిర్రాక్ అనిపిస్తాయ్. మన బుర్ర పదును పెట్టేందుకు సాయపడతాయ్. కష్టమైన టాస్కులు కూడా ఎదుర్కోవాలనే దృక్కోణాన్ని బలపరుచుతాయ్. చాలామంది ఏదో టైమ్ పాస్ కోసం పజిల్స్ అనుకుంటారు కానీ.. అవి మనకు ఇన్ని రకాలుగా ఉపయోగపడతాయని గుర్తించరు. అయితే పజిల్స్‌లో చాలా వెరైటీస్ ఉంటాయ్. పదసంపత్తికి సంబంధించినవి కొన్ని అయితే.. లాజికల్‌ బ్రెయిన్ టీజర్స్( Brain teasers ) ఇంకొన్ని ఉంటాయ్. ఇక ఈ మధ్య కాలంలో ఫోటో పజిల్స్ కూడా బాగా వైరల్ అవుతున్నాయ్. వీటిని కూడా చాలామంది నెటిజన్స్ లైక్ చేస్తున్నారు. ఇందుకంటే ఇవి ఐ పవర్ టెస్ట్ చేసుకునేందుకు ఉపయోగపడతాయ్. తికమకగా ఉండి మనకు సవాల్ విసురుతాయ్. ఈ ఫోటో పజిల్స్‌లో సమాధానాలు కనిపెడితే సూపర్ కిక్ వస్తుంది. మనం తోపులం అన్న ఓ ఫీలింగ్ కలుగుతుంది. అలాంటి ఓ ట్రెండింగ్ పజిల్ మీ ముందుక తీసుకొచ్చాం. మీరు పైన చూస్తున్న ఫోటోలో ఓ పాము దాగుంది. అక్కడున్న చెత్తా చెదారం రంగులో దాని రంగు ఇమిడిపోయి ఉంది. అందుకే ఆ పామును కనిపెట్టడం అంత ఈజీ టాస్క్ కాదు. సరదా తీరిపోతుంది అంతే. కొద్ది సెకన్లలోనే మీరు దాన్ని కనుగొన్నారంటే.. మీ కళ్లలో మ్యాజికల్ పవర్ ఉందనే చెప్పాలి. కాస్త ఫోకస్ పెట్టి చూస్తే కొంచెం టైమ్ తీసుకున్న అది కనిపిస్తుంది. ఏదో లైట్‌గా పైపైన చూస్తే అస్సలు దొరకదు. ఎంతసేపు చూసినా సమాధానం క్లిష్టంగానే అనిపిస్తే దిగువన ఆన్సర్ ఉన్న ఫోటో ఇస్తున్నాం చూసెయ్యండి.

Snake

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..