Optical illusion: మీ ఐపవర్‌కి పరీక్ష.. ‘9’ నెంబర్ల మధ్య ఉన్న ‘6’ని కనిపెట్టగలరా.?

|

Jun 25, 2024 | 4:20 PM

ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఇలా ఎక్కడ చూసినా ఇలాంటి ఫొటోలే దర్శనమిస్తున్నాయి. కేవలం జ్ఞాపకశక్తిని పెంచడమే కాకుండా కంటి చూపును సైతం టెస్ట్‌ చేసేలా ఈ ఆప్టికల్ ఇల్యూజన్‌ ఫొటోలు ఉంటున్నాయి. వీటిలో పర్సనాలిటీ టెస్ట్‌తో పాటు కంటి చూపును పరీక్షించే ఫొటోలు కూడా నెటిజన్లను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఇలాంటి ఓ ఆప్టికల్‌...

Optical illusion: మీ ఐపవర్‌కి పరీక్ష.. 9 నెంబర్ల మధ్య ఉన్న 6ని కనిపెట్టగలరా.?
Follow us on

ఆప్టికల్ ఇల్యూజన్‌ ఫొటోలు ఆసక్తికరంగా ఉంటాయి. వీటిని సాల్వ్ చేయడంలో మంచి కిక్‌ ఉంటుంది. అందుకే ఇలాంటి వాటికి ప్రస్తుతం డిమాండ్‌ పెరుగుతోంది. ముఖ్యంగా ఎప్పుడైతే సోషల్‌ మీడియా విస్తృతి పెరిగిందో అప్పటి నుంచి ఆప్టికల్‌ ఇల్యూజన్‌ ఫొటోలకు డిమాండ్ పెరుగుతోంది.

ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఇలా ఎక్కడ చూసినా ఇలాంటి ఫొటోలే దర్శనమిస్తున్నాయి. కేవలం జ్ఞాపకశక్తిని పెంచడమే కాకుండా కంటి చూపును సైతం టెస్ట్‌ చేసేలా ఈ ఆప్టికల్ ఇల్యూజన్‌ ఫొటోలు ఉంటున్నాయి. వీటిలో పర్సనాలిటీ టెస్ట్‌తో పాటు కంటి చూపును పరీక్షించే ఫొటోలు కూడా నెటిజన్లను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఇలాంటి ఓ ఆప్టికల్‌ ఇల్యూజన్‌ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఎంతనీ ఏంటా ఫొటో.? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

పైన ఉన్న ఫొటో చూడగానే సాధాణంగానే మనకు ‘9’ నెంబర్‌ కనిపిస్తోంది కదూ! అయితే వీటి మధ్యే 6 అంకె కూడా దాగి ఉంది. 9 నెంబర్‌ తిరగేసి ఉంటే 6 అనుకోకండి. ఇందులో నిజంగానే 6 అంకె ఉంది. దానిని గుర్తించడమే ఈ పజిల్‌ ముఖ్య ఉద్దేశం. నెంబర్‌ను గుర్తించగలరేమో ఓసారి ట్రై చేయండి. తీక్షణంగా గమనిస్తే ఇట్టే కనిపెట్టొచ్చు.

అయితే ఈ నెంబర్‌ను మీరు కేవలం 6 సెకండ్లలో కనిపెడితే మీ ఐ పవర్‌ బాగున్నట్లు. ఇంతకీ 6 నెంబర్‌ను కనిపెట్టారా.? ఎంత ట్రై చేసినా కనిపించడం లేదా అయితే ఓసారి చివరి లైన్‌లో నాలుగో వరుసలో చూడండి.. 6 అంకె కనిపిస్తోంది. చూశారుగా కళ్లను మాయ చేసే ఈ ఆప్టికల్ ఇల్యూజన్‌ను. మరెందుకు ఆలస్యం ఈ ఫొటోను మీ ఫ్రెండ్స్‌తో షేర్‌ చేసి పజిల్‌ సాల్వ్‌ చేయగలరేమో సవాల్‌ విసరండి.

మరిన్ని ట్రెండింగ్ కథనాల కోసం క్లిక్ చేయండి..