Viral Video: ఒకే ఒక్కడు 20 మందిని వీర కుమ్ముడు కుమ్మేశాడు.. వీడియో చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

|

Aug 22, 2022 | 1:54 PM

Viral Video: సినిమాల్లో హీరోకు వ్యతిరేకంగా 100 మంది విలన్లు వచ్చినా చాలా ఈజీగా వారందరినీ చిత్తు చిత్తుగా కొట్టి పడేస్తాడు. మరో వంద మందిని పంపించు..

Viral Video: ఒకే ఒక్కడు 20 మందిని వీర కుమ్ముడు కుమ్మేశాడు.. వీడియో చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
Fighting
Follow us on

Viral Video: సినిమాల్లో హీరోకు వ్యతిరేకంగా 100 మంది విలన్లు వచ్చినా చాలా ఈజీగా వారందరినీ చిత్తు చిత్తుగా కొట్టి పడేస్తాడు. మరో వంద మందిని పంపించు అంటూ డైలాగ్స్ కూడా కొట్టేస్తాడు. ఎందుకంటే అది సినిమా కాబట్టి. మరి అదే హీరో నిజం జీవితంలో ఒక్కరినైనా ఎదుర్కొగలరా? అంటే చెప్పడం కష్టమే. ఇక నిజ జీవితానికి వచ్చేసరికి.. బలశాలి అయిన వ్యక్తి మహా అయితే ఓ ఇద్దరిని కొడతాడు. మల్లయుద్ధం, కరాటే వంటివి తెలిసిన వారైతే మరో ఇద్దరిని కొట్టగలుతారు. మరి ఒకే వ్యక్తి ఒకేసారి 20 మందిని కొట్టడం ఎప్పుడైనా చూశారా? అయితే, ఇప్పుడు చూసేయండి. అవును మీరు చదివేది అక్షరాలా నిజం. ఒక వ్యక్తి ఏకంగా 20 మందిని పొట్టు పొట్టుగా కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ వీడియో చూసి నెటిజన్లు ఇది నిజమేనా అని షాక్ అవుతున్నారు.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో రెండు వర్గాల వారు కొట్టుకుంటున్నారు. అయితే, చాలా మంది మాత్రం ఒక్కడినే టార్గెట్‌గా చేసుకుని దాడికి దిగారు. భారీ పర్సనాలిటీ ఉన్న వ్యక్తిపై అంతమంది ఎగబడినా వణకలేదు.. బెనకలేదు.. పైగా పంచ్‌కు ఒకరిని కింద పడేస్తూ.. ఒక్కొక్కరికి చుక్కలు చూపించాడు. అంత మంది దాడి చేసినా అతనికి మాత్రం ఏం కాలేదు. అతని పంచ్‌లు తిన్నవారు మాత్రం నేలకూలి గింజుకున్నారు. ఈ భీకర ఫైటింగ్ వీడియోను @2020Fights పేరుతో ఉన్న ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్ అయ్యింది. ఆ వీడియో చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. అతన్ని నిజమైన బాహుబలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరెందుకు ఆలస్యం ఈ వీడియోపై ఓ లుక్కేసుకోండి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..