
భారతీయ వివాహాలంటేనే హంగామా, రంగురంగుల దుస్తులు, విందు వినోదాలు. అయితే ఈ వేడుకల్లో అతిథులకు ఉండే అతిపెద్ద గోల ఏమిటంటే.. తాము ముస్తాబైన అందాన్ని ఫోటోలుగా బంధించడం. ఫంక్షన్కు వెళ్లినప్పుడు అందరూ బిజీగా ఉండటం వల్ల మన ఫోన్ ఇచ్చి ఫోటో తీయమని ఎవరిని అడగాలో అర్థం కాదు. ఈ ఇబ్బందిని గమనించిన ఈవెంట్ ప్లానర్లు క్లిక్ బడ్డీ అనే సరికొత్త ఆలోచనను తెరపైకి తెచ్చారు.
అనుకుంటున్నారా..? పెళ్లిలో వధూవరుల కోసం ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్లు ఎలాగూ ఉంటారు. కానీ క్లిక్ బడ్డీ కేవలం అతిథుల కోసం మాత్రమే పని చేస్తారు. వీరు ప్రొఫెషనల్ కెమెరాలకు బదులుగా, అతిథుల దగ్గర ఉండే స్మార్ట్ఫోన్లనే వాడుతారు. మీరు ఏ మూలలో ఫోటో దిగాలనుకున్నా, ఏ యాంగిల్లో రీల్ చేయాలనుకున్నా వీరు మీకు సహాయం చేస్తారు.
నేడు ప్రతి ఒక్కరూ తమ ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లేదా ఫేస్బుక్లో షేర్ చేయాలని ఆరాటపడుతున్నారు. నాణ్యమైన ఫోటోలు, వీడియోల కోసం వీరు బాగా ఉపయోగపడుతున్నారు. వీరి ఏర్పాటుతో ఫోటోల కోసం ఇతరులను బతిమిలాడాల్సిన అవసరం ఉండదు. దీనివల్ల అతిథులు ఎటువంటి సంకోచం లేకుండా వేడుకను ఆస్వాదించవచ్చు.
కేవలం ఫోటోలే కాకుండా, ట్రెండింగ్ పాటలకు తగ్గట్టుగా రీల్స్ షూట్ చేయడంలో కూడా వీరు నైపుణ్యం కలిగి ఉంటారు.
ప్రస్తుతం మెట్రో నగరాల్లోని డెస్టినేషన్ వెడ్డింగ్స్, భారీ వివాహ వేడుకల్లో ఈ క్లిక్ బడ్డీల సేవలను వినియోగిస్తున్నారు. దీనికోసం పెళ్లివారు కొంత అదనపు మొత్తం వెచ్చించాల్సి ఉంటుంది. అయినప్పటికీ, అతిథులకు ఒక మర్చిపోలేని అనుభూతిని అందించడానికి పెళ్లివారు ఈ కొత్త ట్రెండ్ వైపు మొగ్గు చూపుతున్నారు.
ప్రకృతి,సాంకేతికత కలిసిన ఈ కాలంలో పెళ్లి జ్ఞాపకాలను పదిలపరుచుకోవడానికి క్లిక్ బడ్డీ ఒక స్మార్ట్ పరిష్కారంగా మారుతోంది. మీ ఇంట్లో తదుపరి పెళ్లికి మీరు కూడా ఒక క్లిక్ బడ్డీని నియమించుకుంటారా?
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..