Viral Video: కస్టమర్ల వేషంలో వచ్చారు, కట్‌చేస్తే.. బంగారు ఉంగరాల ట్రే ఎత్తుకుని పరుగో పరుగు..!

సోషల్ మీడియలో ఒక వీడియో విపరీతంగా వైరల్‌ అవుతోంది..ఇందులో ఒక నగల దుకాణంలో సినిమాను తలపించే దొంగతనం జరిగింది. ఇద్దరు వ్యక్తులు సాధారణ కస్టమర్ల వలె నటిస్తూ నగల షాప్‌లోకి ప్రవేశించారు. షాప్‌ యజమాని వారికి బంగారు ఉంగరాలను చూపుతున్న సమయంలో, అదును చూసి వారిలో ఒక వ్యక్తి ఉంగరాలున్న పూర్తి ట్రేని ఎత్తుకుని బయటకు పరుగులు తీశాడు. వెంటనే అప్రమత్తమైన షాప్‌ యజమాని కౌంటర్‌ దూకి వారిని పట్టుకోవడానికి ప్రయత్నించినప్పటికీ, అప్పటికే వారు బయట సిద్ధంగా ఉన్న కారులో పరారయ్యారు. దుకాణంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డైన ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Viral Video: కస్టమర్ల వేషంలో వచ్చారు, కట్‌చేస్తే.. బంగారు ఉంగరాల ట్రే ఎత్తుకుని పరుగో పరుగు..!
Nashik Gold Jewellery Shop Robbery

Updated on: Nov 10, 2026 | 7:48 PM

రోజురోజుకూ దొంగల నైపుణ్యాలు, సరికొత్త మోసాలు ఆందోళన కలిగిస్తున్నాయి. షాపింగ్ చేయడానికి వచ్చేవారిలా నటిస్తూ క్షణాల వ్యవధిలో కోట్ల విలువైన ఆభరణాలను దోచుకెళ్తున్న ఘటనలు తరచూ చూస్తూనే ఉంటాం. తాజాగా మహారాష్ట్రలోని నాశిక్‌లో ఇలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది. కస్టమర్ల వేషంలో దుకాణంలోకి ప్రవేశించిన ఇద్దరు వ్యక్తులు.. దుకాణదారుడి కళ్లుగప్పి ఏకంగా బంగారు ఉంగరాల ట్రేని ఎత్తుకెళ్లిన తీరు అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. అసలు ఏం జరిగింది?

మహారాష్ట్రలోని నాశిక్‌ ప్రాంతంలో ఉన్న ఒక జ్యువెల్లరీ షాప్‌నకు ఇద్దరు వ్యక్తులు కస్టమర్ల వలె వచ్చారు. షాప్‌లోని యజమానికి ఎలాంటి అనుమానం రాకుండా సాధారణంగా మాట్లాడుతూ వివిధ రకాల ఆభరణాలను చూపించమని కోరారు. షాప్ యజమాని వారికి వివిధ డిజైన్లలో ఉన్న బంగారు ఉంగరాల ట్రేని బయటకు తీసి చూపించాడు. వారు ఆభరణాలను పరిశీలిస్తున్నట్లు నటిస్తూ సరైన అదను కోసం వేచి చూశారు. యజమాని కొద్దిగా ఏమార్చిన ఆ తరుణాన్ని ఆసరాగా చేసుకుని, వారిలో ఒక వ్యక్తి హఠాత్తుగా ఆ బంగారు ఉంగరాల పూర్తి ట్రేని చేతిలోకి తీసుకుని షాప్ నుండి బయటకు పరుగులు తీశాడు. అతని వెనుకే మరో వ్యక్తి కూడా బయటకు పరిగెత్తాడు.

కౌంటర్‌ దూకిన షాప్ యజమాని.. కానీ అప్పటికే ఆలస్యం!

దుండగులు అలా ట్రే పట్టుకుని పారిపోవడాన్ని గమనించిన షాప్ యజమాని క్షణంలో అప్రమత్తమయ్యాడు. వారిని పట్టుకునే ఉద్దేశంతో ఏమాత్రం ఆలోచించకుండా గ్లాస్ కౌంటర్ పైనుంచే అవతలికి దూకాడు. అతని వెనుకే షాప్‌లోని ఇతర సిబ్బంది కూడా బయటకు పరుగెత్తుకుంటూ వచ్చారు. అయితే, దుండగులు అంతకంటే ముందే చాలా పక్కా ప్లాన్‌తో వ్యవహరించారు. షాప్ బయట ముందుగానే ఒక కారును స్టార్ట్ చేసి పెట్టుకున్నారు. ట్రే ఎత్తుకెళ్లిన వెంటనే ఆ కారెక్కి క్షణాల వ్యవధిలో అక్కడి నుండి పరారయ్యారు.

ఇవి కూడా చదవండి

సీసీటీవీలో రికార్డైన దృశ్యాలు.. పోలీసుల గాలింపు

ఈ మొత్తం దొంగతనం ఉదంతం షాప్‌లో ఉన్న సీసీటీవీ కెమెరాలో స్పష్టంగా రికార్డైంది. ఆ దొంగల వేగంగా చేసిన మోసం, షాప్ యజమాని వారిని పట్టుకోవడానికి చేసిన ప్రయత్నం తదితర దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అడ్గావ్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పరారైన ఆ ఇద్దరు నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. రికార్డైన వీడియోను పరిశీలిస్తూ, కారు నెంబర్, ఇతర ఆధారాల ద్వారా దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి. బహిరంగ మార్కెట్‌లో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయాలని స్థానిక వ్యాపారులు కోరుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us