
ఆఫ్‌ట్రాల్ వందల రూపాయల చీర కోసం ఓ తల్లి ఏకంగా కుమారుడు ప్రాణాలనే పణంగా పెట్టిన సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. నాలుగో అంతస్తులో నివసిస్తున్న ఓ మహిళ మూడో అంతస్తు బాల్కానీలో పడిన తన చీరను తీసుకొచ్చేందుకు తన కొడుకును మరో చీరకు కట్టి వేలాడదీసింది. దీన్ని గమనించిన కొందరు వ్యక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
వైరల్ వీడియో ప్రకారం.. నాలుగో అంతస్తులో నివసించే ఓ మహిళకు చెందిన చీర గాలికి మూడో అంతస్తు బాల్కనీలోకి వెళ్లి పడింది. దాన్ని తీసుకొచ్చేందుకు ఆమె తన కొడుకును మరో చీర సహాయంతో వేలాడ దీసింది. తన కుమారుడి నడుముకు ఒక చీరను కట్టి.. దాన్ని బలంగా పట్టుకొని .. కొడుకును పై నుంచి మూడో అంతస్తుకు బాల్కనీకి వేలాడదీసింది. ఆ బాలుడు గాలిలో వేలాడుతూ కింది బాల్కనీలోకి చిక్కుకున్న చీరను పట్టుకున్నాడు. దీంతో తల్లి ఆ బాలుడిని పైకి లాగింది.
తల్లి కాస్త పట్టు కోల్పోయినా, లేదా బాలుడు బ్యాలన్స్ కోల్పోయిన, లేదా చీర ముడి ఊడిపోయినా అక్కడ పెను ప్రమాదమే జరిగేది. బాలుడి ప్రాణాలే పోయేవి. దీన్ని తీక్షణంగా గమనిస్తున్న స్థానికులు బాలుడు సురక్షితంగా పైకి వచ్చేంత వరకు గుండెలను అరచేతిలో పట్టుకొని వీక్షించారు. అయితే మరికొందరు ఈ తతంగాన్నంత వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఇందుకు సంబంధించిన వీడియో ట్రెండింగ్‌లోకి వచ్చింది. వీడియో చూసిన జనాలంతా ఆమెకు కొడుకు ప్రాణం కన్నా, చీరే ముఖ్యమా అంటూ మండిపడుతున్నారు.
వీడియో చూడండి..
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.