Viral Video: పాపం పోరడు.. కోతి చేతిలో అడ్డంగా బుక్కయ్యాడు.. ఈ వీడియో చూస్తే గంటసేపు నవ్వు ఆగదంతే..

Viral Video: మనుషుల వినోదం కోసం జంతువులకు ప్రత్యేక శిక్షణ ఇస్తుంటారు. వాటి శిక్షణ చాలా కఠినంగా ఉంటుంది. శిక్షణ ద్వారానే అవి వాటి యజమానుల ఆదేశాలను పాటిస్తుంటాయి.

Viral Video: పాపం పోరడు.. కోతి చేతిలో అడ్డంగా బుక్కయ్యాడు.. ఈ వీడియో చూస్తే గంటసేపు నవ్వు ఆగదంతే..
Monkey

Updated on: Oct 19, 2021 | 6:12 AM

Viral Video: మనుషుల వినోదం కోసం జంతువులకు ప్రత్యేక శిక్షణ ఇస్తుంటారు. వాటి శిక్షణ చాలా కఠినంగా ఉంటుంది. శిక్షణ ద్వారానే అవి వాటి యజమానుల ఆదేశాలను పాటిస్తుంటాయి. అయితే, జంతువులకు శిక్షణ అంటే అంత తేలికైన పని కాదు. కొన్నిసార్లు శిక్షణ సమయంలో జంతువులు కూడా కోపాన్ని ట్రైనర్‌పై వెలువరిస్తాయి. ఇటీవల కాలంలో ఇలాంటి ఒక వీడియోనే తెరపైకి వచ్చింది. ఆ వీడియోను మీరు చూస్తే అస్సలు నవ్వు ఆపుకోలేరంతే.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. ఒక కోతి తన చేతిలో కత్తిని పట్టుకొని ఉండటం, ట్రైనర్ ఆ కత్తితో దానికి ట్రైనింగ్ ఇస్తుండటం కనిపిస్తుంటుంది. అతను కోతి చేతిని పట్టుకుని, అతని తలపై కత్తిని మూడు నుండి నాలుగు సార్లు కొట్టడానికి ప్రాక్టీస్ చేశాడు. కానీ చివరికి అతను తన చేతిని వదిలేయగా.. కోతి తన చేతిలోని కత్తితో అతని తలపై బలంగా కొట్టింది. దాంతో అతని మైండ్ బ్లాంక్ అయ్యింది. ఈ ఫన్నీ వీడియోను @RexChapman అనే ట్విట్టర్ యూజర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియోను చూసి నెటిజన్లు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు.

దానిపై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ‘‘ఈ వీడియో చూశాక నా నవ్వును ఆపుకోలేకపోయాను.’’ అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా.. ‘‘కోతి తన కోప్నాన్నంతటినీ ఒకేసారి బయటకు తీసినట్లు కనిపిస్తోంది.’’ మరో నెటిజన్ పేర్కొన్నారు. మొత్తంగా నెటిజన్లు ఈ వీడియోకు ఫిదా అయిపోతున్నారు. ఇప్పటి వరకు ఈ వీడియోకు 8 లక్షలకు పైగా వ్యూస్ రాగా, 21 వేలకు పైగా లైక్స్, వేలాది రీట్వీట్లు నమోదు అయ్యాయి.

Viral Video:

Also read:

Zodiac Signs: ఈ మూడు రాశుల వారు ఎప్పుడూ గట్టి పోటీ ఇస్తారు.. ఏ ఏ రాశుల వారంటే..

Indication of body moles: మీ శరీరంపై ఈ ప్రాంతాల్లో పుట్టుమచ్చలు ఉన్నాయా? అయితే ఈ రహస్యాలను తెలుసుకోండి..!

Viral Video: గజదొంగ ఈ డాగ్.. కాపలా ఉంటుందని ఇంట్లో ఉంచిపోతే యజమానికి ఊహించని ట్విస్ట్ ఇచ్చింది..!