యాంకర్‌కి చుక్కలు చూపించిన కోతి.. వీడియో వైరల్..!

అప్పటివరకు ముద్దు చేసిన ఓ యాంకర్‌కి కోతి చుక్కలు చూపించింది. దాని నుంచి తప్పించుకోవడం కోసం ఆ యాంకర్ సెట్ నుంచి బయటకు పరుగులు తీసింది. ఈ ఘటన ఈజిప్టులో జరగ్గా.. దానికి సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. లోబ్నా అసల్ అనే మహిళా యాంకర్‌, మరో యాంకర్‌తో కలిసి ఈజిప్టు నటుడిని ఇంటర్వ్యూ కోసం పిలిచారు. ఆయన తన వెంట కోతిని తెచ్చుకున్నాడు. ఆ కోతిని చూసి ముచ్చటపడ్డ […]

యాంకర్‌కి చుక్కలు చూపించిన కోతి.. వీడియో వైరల్..!
Follow us

| Edited By:

Updated on: May 28, 2020 | 3:15 PM

అప్పటివరకు ముద్దు చేసిన ఓ యాంకర్‌కి కోతి చుక్కలు చూపించింది. దాని నుంచి తప్పించుకోవడం కోసం ఆ యాంకర్ సెట్ నుంచి బయటకు పరుగులు తీసింది. ఈ ఘటన ఈజిప్టులో జరగ్గా.. దానికి సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వివరాల్లోకి వెళ్తే.. లోబ్నా అసల్ అనే మహిళా యాంకర్‌, మరో యాంకర్‌తో కలిసి ఈజిప్టు నటుడిని ఇంటర్వ్యూ కోసం పిలిచారు. ఆయన తన వెంట కోతిని తెచ్చుకున్నాడు. ఆ కోతిని చూసి ముచ్చటపడ్డ లోబ్నా దాన్ని తన వద్దకు తీసుకొని కాసేపుముద్దు చేసింది. అయితే ఉన్నట్లుండి ఆ కోతి తన కోతి చేష్టలను చూపించింది. అనుకోకుండా యాంకర్‌పైనే తిరగబడింది. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ లోబ్నా దాన్ని అదుపు చేసేందుకు ప్రయత్నించింది. అయినా కోతి చేష్టలు ఆగకపోవడంతో.. రక్షించుకోవడం కోసం కోతి సెట్‌ నుంచి బయటకు పరుగులు తీసింది. చివరకు ఓ వ్యక్తి వచ్చి ఆ కోతిని తీసుకున్నాడు. కాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. నెటిజన్ల చేత నవ్వులు పూయిస్తోంది.

Read This Story Also: రీమేక్‌ కోసం తొలిసారి కలవబోతున్న సోదరులు..!

Latest Articles