
ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, వీడియోల కోసం ఈ రోజుల్లో జనాలు ఎలాంటి క్రేజీ పనులైనా చేయడానికి వెనుకాడటం లేదు. తాజాగా ఒక వ్యక్తి విమానాశ్రయం (Airport) లోపలికి పాత సామాన్లు ఏరుకునే రిక్షాను తీసుకువచ్చి రీల్ రికార్డ్ చేయడం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. వీడియో క్లిప్‌లో సదరు యువకుడు తలపై టోపీతో టీ షర్ట్, ప్యాంటు వేసుకుని చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. అయితే అతను నడుపుతున్న వాహనం మాత్రం లగ్జరీ కారు కాదు, అచ్చం మన వీధుల్లో పాత సామాన్లు, ఇనుప ముక్కలు కొనేవాళ్లు వాడే మూడు చక్రాల రిక్షా బండి! సాధారణంగా అత్యంత కట్టుదిట్టమైన భద్రత, హై-క్లాస్ వాతావరణం ఉండే ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ లేదా లాంజ్ లాంటి ప్రదేశంలో ఈ పాత రిక్షాతో అతను రీల్ రికార్డ్ చేయడం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.
ఈ వీడియో సోషల్ మీడియా వేదికలపై ప్రత్యక్షం కాగానే క్షణాల్లో వేలాది వ్యూస్, కామెంట్లతో వైరల్‌గా మారింది. ఈ దృశ్యం చూసి చాలా మంది నవ్వుకుంటుండగా, మరికొందరు మాత్రం అసలు ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీని దాటి ఈ రిక్షా లోపలికి ఎలా వచ్చింది? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్‌పోర్ట్ అధికారుల అనుమతితో ఏదైనా ప్రమోషన్ లేదా షూటింగ్ కోసం దీనిని తెచ్చారా, లేక ఎడిటింగ్ మాయాజాలమా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
sudhirvishwakarma398 అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా షేర్ చేసిన ఈ వీడియోను లక్షలాది మంది వీక్షించగా, చాలా మంది లైక్ కూడా చేశారు.ఈ వైరల్ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. వ్యూస్ కోసం జనాలు ఎక్కడికైనా వెళ్తారు అనడానికి ఇదే నిదర్శనం అని ఒకరు రాయగా, ఎయిర్‌పోర్ట్‌లో పాత సామాన్లు కొనే బిజినెస్ భలే ఉంది! అంటూ కొందరు జోకులు పేలుస్తున్నారు. ఏదేమైనప్పటికీ, రీల్స్ పిచ్చి పీక్స్‌కి చేరిన తరుణంలో, ఎయిర్‌పోర్ట్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ వింత రిక్షా వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..